వాట్సాప్‌ అంటే గ్రూపుల సముదాయం. ఎంత దూరంగా ఉందామనుకున్నా..  స్నేహితులు, బంధువులు, స్కూల్, కాలేజీలు.. ఉద్యోగం ఇలా అన్ని రకాలుగా గ్రూపుల్లో మెంబర్లు అవ్వాల్సిందే. ఇక అదనంగా సోషల్ గ్రూపులు కూడా ఉంటాయి.  అన్ని గ్రూపుల్లో వచ్చే మెసెజులు చూడలేక..  చూసినా ఆ అభిప్రాయాలతో ఏకీభవించలేక.. అలా అని స్పందించలేక సతమతమయ్యే వారు ఎందరో. అలా అని ఎగ్జిట్ అయిపోలేరు. అలా వెళ్లిపోతే లేనిపోని సమస్యలు వస్తాయి.  ఇలాంటి వారి కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ తీసుకు వస్తోంది. అదే గుట్టుగా ఎగ్జిట్ అయిపోవడం. 


వాట్సాప్ కొత్త ఫీచర్ ఇదే - గ్రూప్ అడ్మిన్స్‌కు గుడ్ న్యూస్, మెంబర్స్‌కు బ్యాడ్ న్యూస్ - ఎందుకంటే?


తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అనే కాన్సెప్ట్ వాట్సాప్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లకు ఎవరైనా చెప్పారేమో కానీ.. గ్రూపుల నుంచి గుట్టుగా ఎగ్జిట్ అయిపోయే మార్గం కనిపెట్టాలని నిర్ణయించారు. అంటే గ్రూపు నుంచి వెళ్లిపోతే.. వెంటనే కింద.. ఫలానా వ్యక్తి గ్రూపు నుంచి వెళ్లిపోయాడు అనే మెసెజ్ కనిపించదన్నమాట. అంటే మీరు గ్రూపులో ఉన్నారో వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు. ప్రస్తుతానికి ఆ ఆప్షన్‌ను వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. అది వస్తే గ్రూపుల్లో  నుంచి గుట్టుగా వెళ్లిపోవడం ఈజీ అవుతుంది.


టెలిగ్రామ్, వాట్సప్ వాడాలంటే ఇక డబ్బులు కట్టాల్సిందేనా ? ఆ కంపెనీల కొత్త ప్లాన్ తెలుసా ?


అయితే ఇలా గ్రూపు నుంచి వెళ్లిపోవడం ఎవరికీ తెలియదా అంటే.. కొంత మందికి ఖచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంటుంది. వారెవరంటే...  గ్రూప్ అడ్మిన్లు. ఎవరైతే గ్రూప్ నుంచి వెళ్లిపోతున్నారో వారితో పాటు గ్రూప్ అడ్మిన్లకు కూడా ఎవరెవరు గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయ్యారో తెలిసుకునేలా ఆప్షన్ ఉంటుంది. అయితే నేరుగా వారికి అవసరం లేకపోయినా తెలియచేసే వ్యవస్థ మాత్రం ఉండదని తెలుస్తోంది.


జాగ్రత్తలు తీసుకోకపోతే మీరిక వాట్సాప్ వాడలేరు !


ప్రస్తుతం ఏదైనా గ్రూప్ నుంచి ఎవరైనా ఎగ్జిట్ అయితే వెంటనే ఫలానా వ్యక్తి లెఫ్ట్ అని వస్తుంది. దాంతో అందరూ.. ఎందుకు లెప్ట్ అయ్యారని కంగారు పడటం కామన్‌గా జరుగుతుంది. ఇక ముందు అలాంటి కంగారు ఎవరికీ ఉండకుండా.. గ్రూపు నుంచి ప్రసాంతంగా వెళ్లిపోవాలనుకున్నారు వెళ్లిపోయేలా వాట్సాప్ మంచి సౌకర్యం కల్పించనుందన్నమాట.  ప్రస్తుతానికి బీటా వెర్షన్ లో ఈ ఫీచర్‌కు సంబంధించి టెస్టింగ్ జరుగుతోంది. త్వరలో యూజర్లకు అందుబాటులోకి తెచ్చే అవకాశం ఉంది.