Telangana Defection MLAs: కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ మరో ఐదుగురిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వారిలో కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం సమాధానం చెప్పడానికి ఆలస్యం చేశారు. తాజాగా కడియం శ్రీహరి కూడా తాను బీఆర్ఎస్ కు రాజీనామా చేయలేదని ప్రకటించారు.             

Continues below advertisement

పార్టీ మారలేదని స్పీకర్ కు కడియం శ్రీహరి సమాధానం              

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లిఖితపూర్వక సమాధానం సమర్పించారు. పార్టీ ఫిరాయింపు ఆరోపణలపై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌కు స్పందిస్తూ ఆయన  ఈ లేఖ రాశారు.   బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను. కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. ఎక్కడా అలా వ్యవహరించలేదు అని స్పష్టం చేసారు. బీఆర్ఎస్ ఆరోపణలు మీడియా రిపోర్టుల ఆధారంగానే ఉన్నాయని, వాటికి ఎలాంటి నిజాయితీ లేదని ఆయన ఖండించారు. బీఆర్ఎస్ పార్టీ తన నుంచి నెలవారీ రూ.5,000 లెజిస్లేటివ్ పార్టీ ఖర్చుల కంట్రిబ్యూషన్‌ను ఇప్పటికీ స్వీకరిస్తోందని కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఇది తాను ఇంకా పార్టీ సభ్యుడిగానే ఉన్నాననడానికి స్పష్టమైన ఆధారమని వాదించారు. బీఆర్ఎస్ నాయకత్వం తనకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని, డిసిప్లినరీ చర్యలు తీసుకోలేదని ఆయన తెలిపారు.             

Continues below advertisement

నలుగురిపై  ఏక్షణమైనా నిర్ణయం తీసుకోనున్న స్పీకర్           స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్  అరెకపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, టి. ప్రకాశ్ గౌడ్ పై అనర్హత పిటిషన్లను కొట్టివేశారు. పార్టీ మారినట్టు నిరూపితమైన ఆధారాలు లేవని తేల్చారు. మిగతా ఎమ్మెల్యేలు  కాలే యాదయ్య, పోచారం శ్రీనివాస రెడ్డి, ఎం. సంజయ్ కుమార్ తో పాటు కడియంపై  తీర్పు వెలువరించాల్సి ఉంది. కడియం కేసులో విచారణ ఇంకా జరగాల్సి ఉంది.         

దానం నాగేందర్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు ?                  దానం నాగేందర్ కేసు ప్రత్యేకమైనది. ఆయన కాంగ్రెస్ టికెట్‌పై సికింద్రాబాద్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేశారు, ఇది స్పష్టమైన ఫిరాయింపు ఆధారం.  ఇతరుల్లాగానే  ఆధారాలు సరిపోలేవు అని కొట్టివేయడానికి అవకాశం తక్కువ. అందుకే దానం నాగేందర్ ఇంకా వివరణ ఇవ్వలేదు.  కానీ అనర్హత వేటు పడితే ఉప ఎన్నికలు తప్పవు . అనర్హతా వేటు వేయాల్సి వస్తే రాజీనామా చేయిస్తారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.  పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారం జరగనుంది.