Jupalli   :   మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు 20వ తేదీన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కొల్లాపూర్ లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఈ సభకు ప్రియాంకా గాంధీ హాజరు కానున్నారు.  ఈ సభలో జూపల్లి తోపాటు ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి తోపాటు మరికొందరు పార్టీలో చేరనున్నారు . కొల్లాపూర్ సభ ఖమ్మం సభకంటే విజయవంతం అవుతుందని కాంగ్రెస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  బిజెపి లో లుకలుకలున్నాయి .. కాషాయం పార్టీలో చాలామంది నేతల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయన్నారు.  బిఆర్ఎస్ ను ఎదుర్కొనే పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని..  ఎన్ని మాయమాటలు చెప్పిన బిఆర్ఎస్, బీజేపీలను నమ్మరని మల్లు భట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు.                        


100 సీట్లతో రాష్ట్రంలో 300 సీట్లతో కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్ లు ఏర్పడనున్నాయి. ప్రజా ప్రభుత్వం కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యాలని  పిలుపునిచ్చారు. కొల్లాపూర్ సభా ఏర్పాట్లపై చర్చించేందుకు  సోమవారం  భట్టి విక్రమార్క నివాసానికి జూపల్లి కృష్ణారావు వచ్చారు.  పాదయాత్ర విజయవంతపై భట్టికి జూపల్లి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ... కొల్లాపూర్‌లో జరగబోయే బహిరంగ సభకు రావాలని భట్టిని కోరినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై అనేక విషయాలు యాత్రలో తెలుసుకున్నట్లు భట్టి చెప్పారన్నారు.                                                        


మహబూబ్ నగర్ జిల్లా నేతలంతా కలిసి మాట్లాడుకున్నామని..పారు. సభకు జాతీయ నేతలు రాబోతున్నారని.. సభను సక్సెస్ చెయ్యాలని చూస్తున్నామన్నారు. అన్ని నియోజకవర్గాల నుంచి నేతల చేరికలు ఉంటాయన్నారు. కూచుకుల్లా దామోదర్ రెడ్డి ఆయన కుమారుడు, మేఘా రెడ్డితో పాటు చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరనున్నట్లు జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.జూపల్లి కాంగ్రెస్‌లో చేరుతున్నందుకు ధన్యవాదాలు అని భట్టి అన్నారు. జూపల్లి చేరిక పార్టీకి, రాష్ట్రానికి ఉపయోగపడుతుందన్నారు. చేరిక సమయంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని.. సభ ద్వారా తెలంగాణ సమాజానికి ఓ మెసేజ్ వెళ్లనుందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా నేతలు క్యాడర్ కదిలిరావాలని పిలుపునిచ్చారు.                  


జూపల్లి కృష్ణారావు మొదట కాంగ్రెస్ లోనే ఉండేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కూడా అయ్యారు. 2018 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్థన్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన  బీఆర్ఎస్ లో చేరడంతో ... జూపల్లి కృష్ణరావుకు ప్రాధాన్యం తగ్గిపోయింది. వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇచ్చే అవకాశం లేకపోవడతో ఆయన కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు.