Telangana BJP :   జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ గతంలో ప్రాంతీయ ఆకాంక్షలను విస్మరించిన ఫలితంగా దేశంలో ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వెల్లడించారు. నాడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఆ విధంగా ఏర్పడినదేనని వివరించారు. ప్రాంతీయ పార్టీలు కేవలం తమ ప్రాంతీయ ఆకాంక్షల కోసమే ఏర్పడడంతో సుదీర్ఘ కాలం పాటు జాతీయ ఆకాంక్షలు విస్మరణకు గురయ్యాయని నడ్డా తెలిపారు. ఆయా ప్రాంతీయ పార్టీలు క్రమంగా కుటుంబ పార్టీలుగా అవతరించాయని, ఇప్పటి బీఆర్ఎస్ కూడా ఒక కుటుంబ పార్టీయేనని స్పష్టం చేశారు.  తెలంగాణలో కేసీఆర్ పాలన  రజాకార్లను తలపిస్తోందని విమర్శించారు. వచ్చే ఎన్నికలతో తెలంగాణలో బీఆర్ఎస్ కుటుంబ పాలన ముగిసిపోతుంది... కేసీఆర్ కు నేనిచ్చే సందేశం ఇదే అని నడ్డా ఉద్ఘాటించారు. మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో ఇవాళ బీజేపీ రాష్ట్ర మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా నడ్డా పైవ్యాఖ్యలు చేశారు.


వారసత్వ, అవినీతి  రాజకీయాలకు తెలంగాణ ప్రజలు విముక్తి చేసి, బంగారు తెలంగాణ నిర్మాణం కావాలంటే అభివృద్ధి చేస్తున్న  భారతీయ జనతా పార్టీ  అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రజలను బీజేపీ విజ్నప్థి చేస్తుందన్నారు.    బీజేపీ ఆవిర్భావం నుంచి తన దార్శనికతకు అనుగుణంగా ఉన్న ఏకైక పార్టీ. మన కార్యకర్తలు దేశం యొక్క పురోగతిపై మక్కువ కలిగి ఉంటారు, ప్రాంతీయ మరియు జాతీయ సమస్యలకు పరిష్కారాలను అందించగలరని నడ్డా వ్యాఖ్యానించారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే దృక్పథంతో  ప్రజల వద్దకు వెళ్లాలని నేతలకు పిలుపునిచ్చారు. 


తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ విడుదలవబోతున్న సమయంలో పార్టీ సన్నాహాక సమాశాలను జేపీ నడ్డా ఏర్పాటు చేశారు.  తెలంగాణలో ఎన్నికల వ్యవహారాలను సమన్వయం చేసుకునేందుకు నియమించిన కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


 





 


తెలంగాణ బీజేపీ నేతలు వచ్చే ఎన్నికల్లో ప్రజలు తమకు పట్టం కడతారని.. దేశవ్యాప్తంగా నరేంద్రమోదీ చేస్తున్న అభివృద్ధి పనులు.. దేశాన్ని పటిష్టం చేస్తున్న వైనం  చూసి అండగా నిలబడతారని గట్టిగా నమ్ముతున్నారు.