వామికా గబ్బి. సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. నార్త్, సౌత్ అనే తేడా లేకుండా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తూ ఆకట్టుకుంటోంది.  తెలుగులో సుధీర్ బాబు హీరోగా నటించి ‘భలే మంచిరోజు’ చిత్రంలో హీరోయిన్ గా కనిపించింది. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేకపోయినా, అమ్మడు నటనకు మార్కులు బాగానే పడ్డాయి. తెలుగులో పెద్దగా సినిమాలు చేయకపోయినా, ఇరత భాషల్లో తరుచుగా అవకాశాలు దక్కించుకుంటూనే ఉంది. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ నిత్యం అందాల ఆరబోతతో నెటిజన్లను అలరిస్తుంది.

   


‘కుఫియా’లో వామికా అందాల షో


తాజాగా వామిక  నెట్ ఫ్లిక్స్ వెబ్ సిరీస్ ‘కుఫియా’లో నటించింది. టబు, అలీ ఫజల్ ఈ వెబ్ సిరీస్ లో కీలక పాత్రలు పోషించారు. ఇక ఇందులో వామిక ఓ రేంజిలో రెచ్చిపోయింది. అందాల ప్రదర్శనకు ఏమాత్రం హద్దులు పెట్టుకోలేదు. ఈ వెబ్ సిరీస్ లో అమ్మడు అందాల కనువిందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వామ్మో వామికా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు.  






వామికా దశ తిరిగినట్లేనా?


‘కుఫియా’ సిరీస్ లో చాలా సన్నివేశాల్లో వామికా సెమీ న్యూడ్ గా కనిపించింది. ఈమె కారణంగానే సిరీస్ కు బాగా పాపులారిటీ వచ్చిందంటున్నారు ఆడియెన్స్. ఈ సిరీస్ లో వామికా నటన కూడా అద్భుతంగా ఉందంటున్నారు. ఇకపై అమ్మడు దశ తిరగడం ఖాయం అని జోస్యం చెప్తున్నారు. ప్రస్తుతం వామిక అందాల ఆరబోత అంశం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో నిలిచింది.  ఈ రేంజిలో అందాలు చూపిస్తే, అవకాశాలు వద్దన్నా తలుపు తడతాయంటున్నారు.   










అట్లీ మూవీలో వామికాకు అవకాశం


ఇప్పటికే వామిక గ‌బ్బీ 'జూబిలి'..'గ్ర‌హ‌న్' లాంటి వెబ్ సిరీస్ ల‌లో నటించింది. ఇందులోనూ అందాల ప్రదర్శన చేసినా, ‘కుఫియా’ రేంజిలో మాత్రం కాదు. రీసెంట్ గా ఈ ముద్దుగుమ్మ  అట్లీ సినిమాలో అవ‌కాశం ద‌క్కించుకుంది. అట్లీ లాంటి స్టార్ డైరెక్ట‌ర్ తో ప‌నిచేయ‌డం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. అయితే, ఈ సినిమాకు అట్లీ దర్శకత్వం వహించడం లేదు. నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి  క‌లీస్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్ గా కలీస్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో అట్లీ  ఈ చిత్రాన్ని నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ఈ సినిమాలో వామికాను హీరోయిన్ గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఇక తనకు డ్రీమ్ రోల్ అని ఏదీ లేదని చెప్పింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని, చేసే ప్రతి పాత్రను డ్రీమ్ రోల్ గానే భావిస్తానని వెల్లడించింది.   


Read Also: ఐకాన్ స్టార్ కు అరుదైన గౌరవం, మేడం టుస్సాడ్స్ లో మైన‌పు విగ్ర‌హం, కొల‌త‌లు కూడా ఇచ్చేశారుగా!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial