టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప’ మూవీతో ఓ రేంజ్లో  పాపులారిటీ సంపాదించుకున్నారు. దేశ వ్యాప్తంగా ఆయన అద్భుత నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో నటనకు గాను ఏకంగా ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డుకు ఎంపియ్యారు. తెలుగు సినిమా పరిశ్రమలో ఏ హీరోకు సాధ్యం కాని ఘనతను సొంతం చేసుకున్నారు. తాజాగా ఆయన మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. ప్రపంచ ప్రఖ్యాత మ్యూజియం మేడమ్‌ టుస్సాడ్స్‌ లో ఆయన మైనపు విగ్రహం కొలువుదీరబోతోంది. దుబాయ్‌లో ఉన్న మ్యూజియంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ ఏడాదిలోనే ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు మేడమ్‌ టుస్సాడ్స్‌  వెల్లడించింది. అంతేకాదు, అల్లు అర్జున్ కొలతలు సేకరిస్తున్న వీడియోను ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.


బన్నీ కొలతలు తీసుకున్న మ్యూజియం నిర్వాహకులు  


తాజాగా మేడమ్‌ టుస్సాడ్స్‌ రిలీజ్ చేసిన వీడియోలో, అల్లు అర్జున్ స్టైలిష్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. మ్యూజియం ప్రతినిధులు బన్నీని కలిసి కొలతలు తీసుకున్నారు. స్టైలిష్ లుక్ లో విగ్రహాన్ని రూపొందించే పనిలో పడ్డారు శిల్పులు. ప్రస్తుతం విగ్రహం తయారీ పనులు వేగంగా కొనసాగుతున్నాయట. ఈ ఏడాది(2023) చివరి నాటికి అల్లు అర్జున్ మైనపు విగ్రహం రెడీ కాబోతోంద‌ని నిర్వాహ‌కులు తెలిపారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌లో తొలిసారి జాతీయ ఉత్త‌మ న‌టుడిగా అవార్డు అందుకోవడం, మేడమ్ టుస్సాడ్స్ లో విగ్రహం ఏర్పాటు కావడం వెంటవెంటనే జరిగిపోవడంతో బన్నీ ఫుల్ ఖుషీలో ఉన్నారు.  


సంతోషం వ్యక్తం చేసిన అల్లు అర్జున్


ఇక తాజాగా వీడియోలో అల్లు అర్జున్ “మేడం టుస్సాడ్స్ లో నా విగ్రహం పెడతారని అస్సలు ఊహించలేదు. ఇకపై మేడం టుస్సాడ్స్ మ్యూజిక్ కు వెళ్లిని ప్రతిసారి అందమైన మైనపు బొమ్మగా కనిపించబోతున్నాను. ఊహించుకుంటేనే ఎంతో సంతోషంగా ఉంది” అని తెలిపారు.    






‘పుష్ప 2’ షూటింగ్ లో ఫుల్ బిజీ


ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పుష్ప 2' షూటింగ్‌లో బ‌న్నీ బిజీగా ఉన్నారు.   రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘పుష్ప: ది రూల్’ చిత్రంపై దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ సెన్సేషనల్ హిట్ అందుకోవడంతో, ఈ చిత్రం కోసం సినీ లవర్స్ ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ‘పుష్ప’లో నటనకు గాను అల్లు అర్జున్ జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకోవడంతో ‘పుష్ప 2’తో బాక్సాఫీస్ దగ్గర రికార్డుల మోత మోగించడం ఖాయం అని బన్నీ అభిమానులు భావిస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ ‘పుష్ప 2’ ఆగస్ట్ 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నారు.  సందీప్ రెడ్డి వంగాతోను ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Read Also: 'లియో'పై టాలీవుడ్ నిర్మాత ఆసక్తికర వ్యాఖ్యలు, నిప్పులు చెరుగుతున్న విజయ్ ఫ్యాన్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial