Jitendar reddy: తెలంగాణ బీజేపీ నేత జితేందర్ రెడ్డి మరో ట్వీట్‌తో బీజేపలో కలకలంరేపారు. ఈ సారి బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌కు మద్దతుగా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. రఘునందన్‌ను జాతీయ అధికార ప్రతినిధి చేయాలనే డిమాండ్‌కు నేను సపోర్ట్ చేస్తా అంటూ అంటూ ట్విట్ తో పాటు రఘునందన్ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో కేంద్రానికి మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై రఘునందన్ విమర్శలు చేశారు. ముఖ్యంగా మంత్రి హరీష్ రావుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రస్తుతం బీజేపీలో పదవుల పంచాయతీ జరుగుతోంది. దీంతో జితేందర్ రెడ్డి ట్వీట్ వైరల్ అవుతోంది.
వివాదాస్పద ట్వీట్‌తో కలకలం రేపిన జితేందర్ రెడ్డి
మూడు రోజుల కిందట మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి వివాదాస్పద ట్వీట్ వైరల్‌గా మారుతోంది. తమ పార్టీ నేతలపై సెటైర్లు వేస్తూ ఆయన చేసిన పోస్ట్ ఉదయం నుంచి వైరల్‌గా మారుతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న బీజేపీ లీడర్లకు ఇలాంటి ట్రీట్మెంట్ అవసరం అంటూ ఓ మొరటు వీడియోను ఆయన పోస్టు చేశారు. కాసేపటికే దాన్ని డిలీట్ చేశారు. అయితే దాన్ని నెటిజన్లు ఫోటోలు తీసి వైరల్ చేశారు. ఎలాగూ విషయం బయటకు వచ్చిందని గ్రహించిన జితేందర్‌రెడ్డి మరోసారి అదే వీడియోను పోస్టు చేశారు.
బండి సంజయ్ ప్రశ్నించేటోళ్లకే ఆ ట్వీట్
కాసేపటికే మరో ట్వీట్ చేసిన ఆయన బండి సంజయ్‌ను ప్రశ్నించేటోళ్లకు ఇలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఈ ట్వీట్ చేసినట్టు చెప్పుకొచ్చారు. ఆయన ఏమన్నారంటే" కేసిఆర్ సోషల్ మీడియా ఊరకుక్కలకు తెల్వాల్సిన ముచ్చట ఏంటిదంటే... బండి సంజయ్ నాయకత్వాన్ని ప్రశ్నించేటోళ్లకు ఎలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాల్నో చెప్పే ప్రయత్నాన్ని తప్పుగe అర్థం చేసుకునే ఊరకుక్కల్లార... బిస్కెట్ల కోసం బరితెగించకుర్రి" అని తీవ్ర పదజాలంతో మరో ట్వీట్ చేశారు.
తెలంగాణ బీజేపీలో గందరగోళం
తెలంగాణ బీజేపీలో ప్రస్తుతం గందరగోళం కొనసాగుతోంది. బండి సంజయ్ ను తప్పించాలని కొంత మంది నేతలు హైకమాండ్ వద్ద పట్టుబడుతున్నారు. అయితే బండి సంజయ్ నే కొనసాగించాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. ఈ వర్గపోరాటంలో హైకమాండ్ ఏం ఆలోచిస్తుందో అర్థం కావడం లేదు కానీ బండి సంజయ్ ను తప్పించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ బీజేప వ్యవహారాల ఇంచార్జ్ మాత్రం అదేమీ లేదంటున్నారు. కానీ ఎవరూ పట్టించుకోవడం లేదు.