Mangalavaaram: దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్100’ సినిమాలో హీరోయిన్ గా చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్. ఈ మూవీ భారీ హిట్ అందుకోవడంతో ఓవర్నైట్ లోనే స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకుంది పాయల్. ఈ మూవీలో కొంచెం బోల్డ్ గా కనిపించి కుర్రకారును ఆకట్టుకుంది. మళ్లీ ఇప్పుడు తనకు మంచి హిట్ అందించిన అజయ్ భూపతి దర్శకత్వంలో ‘మంగళవారం’ అనే సినిమాలో నటించింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో కూడా పాయల్ లుక్ చూస్తే ఈ సినిమాలో కూడా రొమాంటిక్ రోల్ చేస్తున్నట్టు అనిపిస్తోంది. దీంతో ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. తాజాగా ‘మంగళవారం’ మూవీ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్.


మళ్లీ అదే బోల్డ్ పాత్రలో పాయల్?


పాయల్ రాజ్ పుత్ కు ‘ఆర్ఎక్స్100’ తో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఈ మూవీలో తన గ్లామర్ కు యూత్ ఫిదా అయింది. మళ్లీ ఇప్పుడు అజయ్ భూపతి దర్శకత్వంలో వస్తోన్న ‘మంగళవారం’ సినిమాలో కూడా పాయల్ బోల్డ్ గానే నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే మూవీ ఫస్ట్ లుక్ లో కూడా పాయల్ హాట్ గానే కనిపించింది. దీంతో ఈ మూవీలో కూడా బోల్డ్ పాత్రలోనే కనిపిస్తుందని అంటున్నారు. ఈ మూవీ లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో కమర్షియల్ హంగులతో తెరకెక్కుతోందని సమాచారం. ఇక ఈ మూవీకు సంబంధించిన టీజర్ ను జులై 4 న ఉదయం 10:30 గంటలకు విడుదల చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు మేకర్స్.


కళ్లల్లో భయం..


అజయ్ భూపతి సినిమా టేకింగ్ చాలా బాగుంటుంది. ఆయన గత సినిమాలు చూస్తే అది క్లియర్ గా తెలుస్తుంది. ‘ఆర్ఎక్స్100’ లో కూడా పాయల్ రాజ్ పుత్ లో నెగిటివ్ షేడ్ ను చాలా చక్కగా టేకింగ్ చేయగలిగారు. అందుకే ఆ సినిమాలో ఇందు పాత్రకు అంత క్రేజ్ వచ్చింది. ఇప్పుడు ‘మంగళవారం’ అనే సినిమాపై కూడా అలాంటి క్యూరియాసిటీను క్రియేట్ చేస్తున్నారు అజయ్ భూపతి. టీజర్ రిలీజ్ పోస్టర్ లో కూడా ‘కళ్లల్లో భయం’ అంటూ ఇంట్రస్టింగ్ గా రాసుకొచ్చారు. దీంతో ఈ మూవీపై ఉత్కంఠ నెలకొంది. ‘ఆర్ఎక్స్100’ లో పాయల్ రాజ్ పుత్ తో మ్యాజిక్ చేసిన అజయ్ ఈసారి ‘మంగళవారం’ సినిమాలో ఆమెను ఎలాంటి పాత్రలో చూపిస్తారో అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు పాయల్ ఫ్యాన్స్. 


‘ఆర్ఎక్స్100’, ‘మహా సముద్రం’ సినిమాల తర్వాత తన మూడో చిత్రంగా ఈ ‘మంగళవారం’ అనే సినిమాను చేస్తున్నారు దర్శకుడు అజయ్ భూపతి. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ సైలెంట్ గా పూర్తి చేశారని సమాచారం. ఇందులో పాయల్ రాజ్ పుత్ తో పాటు పలువురు టాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే మూవీ టీమ్ ప్రమోషన్స్ కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీను పాన్ ఇండియా లెవల్లో విడుదల చేయనున్నారు. ఈ సినిమాను స్వాతి గుణపాటి, సురేష్ వర్మ నిర్మిస్తున్నారు. కాంతార సినిమా ఫేమ్ అజనీష్ లోక్నాథ్ సంగీతం అందిస్తున్నారు. మరి ఈ మూవీ దర్శకుడు అజయ్ భూపతికి అలాగే పాయల్ రాజ్ పుత్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి. 


Also Read: టాలీవుడ్‌లో సినీ జాతర - జులైలో అన్నీ భారీ చిత్రాలే, ఒకే రోజు మూడు క్రేజీ మూవీస్ రిలీజ్!