సోషల్ మీడియా(Social Media) పరిచయాలు కొన్ని సార్లు చేదు అనుభవాలను మిగిల్చితే మరికొన్ని సార్లు తీపి గుర్తులను అందిస్తాయి. ఎప్పుడో చదువుకున్నప్పుడు కలిసిన మిత్రుడ్ని మళ్లీ కలిసేలా చేస్తాయి. అలాగే కొత్త పరిచయాలతో మరింత మందిని స్నేహితుల్ని చేస్తాయి. అలాగే సామాజిక మాధ్యమాల్లో పరిచయం ఏర్పడి, ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లిళ్లు జరిగిన ఘటనలు కూడా తరచూ చూస్తుంటాం. ఇలాంటి ఘటనే జగిత్యాల జిల్లా(Jagityala District)లో జరిగింది. సోషల్ మీడియా వారి మూగమనసులను కలిపింది. ఆంధ్ర అబ్బాయి, తెలంగాణ అమ్మాయి ఇన్ స్టాగ్రామ్(Instagram) వేదికగా ప్రేమించుకున్నారు. స్నేహితుల సాయంతో పెళ్లి చేసుకున్నారు. 




వారిద్దరికీ మాటలు రావు కానీ వారి మనసులు మాట్లాడుకున్నాయి. సామాజిక మాధ్యమం ద్వారా ఏర్పడిన వారి పరిచయం పెళ్లి వరకూ నడిచింది. సోషల్ మీడియా పరిచయ ప్రేమల్లో నూటికి 90 శాతం మోసపోయిన వాళ్లే ఉంటారు. కానీ వీరి ప్రేమకు శుభమ్ కార్డు పడింది. ఇద్దరు తమ భావాలను పంచుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. 


Also Read: Medaram Jatara 2022: ఆ ప్రదేశంలో చిన్న తప్పు చేసినా తేనెటీగలు వెంటాడుతాయట


ఈ రోజుల్లో సోషల్ మీడియా ప్రభావం అంతా ఇంతా కాదు. ఎక్కడో ఉన్నవారిని సైతం క్షణాల్లో పలకరించగలిగే సౌకర్యం. కొత్తవారితో స్నేహం కోసం సోషల్ మీడియా ఎంతగానో సహకరిస్తుంది. సోషల్ మీడియాలో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారి ప్రేమను హ్యాపీ ఎండింగ్ ఇచ్చేందుకు పెళ్లి కూడా చేసుకున్నారు. ఇన్‌ స్టాగ్రామ్‌ ద్వారా కలిసిన ఆ మూగమనసులు ఒకటయ్యారు. తెలంగాణ(Telangana) జగిత్యాల జిల్లా రాయికల్‌ మండల కేంద్రంలో వారి పెళ్లి వైభవంగా నిర్వహించారు. ఇక వివరాల్లోకి వెళ్తే రాయికల్‌కు చెందిన అత్రం లత అలియస్‌ జ్యోతి అనే యువతి ఒంగోలు(Ongole)కు చెందిన అరుణ్‌ అనే యువకుడు ఇద్దరూ మూగవారే. అయితే ఇన్‌ స్టాగ్రామ్‌లో ఇద్దరు ఒకరికొకరు పరిచయమయ్యారు. వారి భావాలను పంచుకున్నారు. వీళ్లిద్దరి స్నేహం ప్రేమగా మారి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. స్థానిక యువకుల సహకారంతో ఇద్దరూ ఒకటయ్యారు. సామాజిక కార్యకర్తలు రియజుద్దీన్, కాసారపు రమేష్ ,మహ్మద్ బాబుజాన్‌ వారికి దగ్గరుండి పెళ్లి జరిపించారు. 


Also Read: KCR Birthday Wishes: కూరగాయలు, పువ్వులతో కేసీఆర్ చిత్రం, కడియంలో తెలంగాణ సీఎం జన్మదిన వేడుకలు


Also Read: AP Telangana : త్రిసభ్య కమిటీ తొలి భేటీలో నిరాశే ! తెలుగు రాష్ట్రాల మధ్య ఒక్క అంశంలోనూ రాని ఏకాభిప్రాయం..?