ఉక్రెయిన్ సరిహద్దు(Ukrains Border) నుంచి సైనిక దళాలను మళ్లించినప్పటికీ రష్యా(Russia) దాడి చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉందని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్(US President Joe Biden) అన్నారు. గురువారం అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన ఆయన "రాబోయే కొద్ది రోజుల్లో" రష్యా తిరిగి దాడి చేయొచ్చని జో బిడెన్ అన్నారు. పొరుగు దేశాలపై దాడి చేస్తుందనే భయాలు పెరుగుతున్నందున రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌(Russian President Vladimir Putin)కు కాల్ చేసే ఆలోచన తనకు లేదని అన్నారు. అయితే ఉక్రెయిన్‌పై దాడి చేసే ఆలోచన లేదని క్రెమ్లిన్ ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యన్ బలగాలు దాడి చేయడంలేదని గత కొన్ని రోజులుగా యునైటెడ్ స్టేట్స్ దాని మిత్రదేశాలు అధికారికంగా ప్రకటిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రిత్వ శాఖ బహిరంగ ప్రకటనలో తెలిపింది. ఐక్యరాజ్యసమితిలోని యూఎస్ రాయబారి రష్యా ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకు చూస్తుందని హెచ్చరించారు. రష్యా దాడికి అవకాశం ఉన్నందున ఉద్రిక్తతలు మళ్లీ పెరగడంతో, అమెరికా దౌత్యవేత్త లిండా థామస్ గ్రీన్‌ఫీల్డ్(linda thomas-greenfield) మాట్లాడుతూ విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ ఉక్రెయిన్‌పై కౌన్సిల్ సమావేశంలో ప్రసంగిస్తారన్నారు. దౌత్యం విధానాలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. "పరిస్థితి తీవ్రతను తెలియజేయడమే మా లక్ష్యం. రష్యా దాడి వైపు కదులుతుందనడానికి మాకు ఆధారాలు ఉన్నాయి. ఇది చాలా కీలకమైన క్షణం" అని ఆమె ట్వీట్ చేసింది.






రష్యా, ఉక్రెయిన్‌(Russia-Ukraine) మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ సమయంలో అక్కడి పరిణామాలను ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తుంది. తూర్పు ఉక్రెయిన్‌ ప్రాంతంలోని కాడివ్కాలో కాల్పులు జరిగాయి. రష్యా మద్దతున్న వేర్పాటు వాదులు, ఉక్రెయిన్‌ సైనికుల(Ukarine Army) మధ్య ఈ కాల్పులు జరిగాయి. ఆ ఘటనలో ప్రాణనష్టం ఏంజరగలేదు కానీ ఇద్దరు పౌరులకు గాయాలైనట్లు అంతర్జాతీయ మీడియా తెలిపింది. సరిహద్దు ప్రాంతంలో కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లఘించారని ఇరు పక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. సరిహద్దు ప్రాంతంలో గ్రేనేడ్లు, భారీ ఆయుధాలతో వేర్పాటు వాదులు కాల్పులు జరిపినట్లు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. ప్రభుత్వ బలగాలే తమపై కాల్పులు జరిపాయని వేర్పాటు వాదులు ఆరోపిస్తున్నారు. గత 24 గంటల్లో నాలుగు సార్లు కాల్పులు జరిపినట్లు ఆరోపించారు. సరిహద్దుల్లో సైన్యం మోహరించిన తరుణంలో రెచ్చగొట్టేందుకే ఈ ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌ ఆక్రమించేందుకు రష్యా ఎత్తుగడలు వేస్తుందని అమెరికా(America) ఆరోపిస్తుంది. ఆ ప్రాంతంలో మారణహోమం సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే పొరుగు దేశంపై దాడి చేయాలనే ఆలోచన తమకు లేదని రష్యా చెబుతోంది. సరిహద్దుల్లో మోహరించిన సైన్యాన్ని వెనక్కి పిలిపించామని క్రెమ్లిన్ ప్రకటించింది. దాదాపు లక్షకుపైగా సైనిక దళాలను వెనక్కి రప్పించే పనిలో ఉన్నామని రష్యా ప్రకటించింది. అయితే అమెరికా మాత్రం రష్యా ప్రకటనను అవాస్తమంటుంది. ఇంకా వేల సంఖ్యలో రష్యా బలగాలు ఉక్రెయిన్ సరిహద్దుకు చేరుకుంటున్నట్లు ఆరోపించింది.