Jaggareddy :   తెలంగాణలో టీఆర్ఎస్ నేతల ఇళ్లల్లో సోదాలు చేస్తున్న ఐటీ అధికారులపై  సీఎం కేసీఆర్ ఏసీబీ దాడులు చేయిస్తారని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి జోస్యం చెప్పారు. గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ అంతర్గత పంచాయతీ లోక కల్యాణం కోసమని విశ్లషించారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీపై మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.  రాహుల్ గాంధీ పై మర్రి శశిధర్ రెడ్డి మాట్లాడటం తప్పన్నారు.  మర్రి చెన్నారెడ్డి సీఎం అయ్యాడు.. ఆయన కూడా డబ్బులు ఇచ్చి సీఎం అయ్యాడా..? అని శశిధర్ రెడ్డిని ప్రశ్నించారు. తాను రాహుల్ గాంధీ..ఠాగూర్.. లకే జవాబుదారీనన్నారు. 


కూడబలుక్కునే బీజేపీ, టీఆర్ఎస్ రాజకీయాలు చేస్తున్నాయన్న  జగ్గారెడ్డి 
 
టీఆర్ఎస్, బీజేపీ దౌర్భాగ్య పరిపాలన అందిస్తున్నాయని..   ప్రజల కష్టాలు గాలికి వదిలేశారని  జగ్గారెడ్డి విమర్శించారు.  రెండు కోట్ల ఉద్యోగాలు ఎక్కడ పోయాయి నల్లధనం తెస్తానన్న మోడీ ఏం చేశాడో చెప్పాలన్నారు.  మాటల గారడి.. మత చిచ్చు.. ఇదే పని  .. ప్రజలు ఎందుకు ఇవన్నీ ఆలోచన చేయడం లేదో అర్థం కావడ లేదన్నారు.  అమ్మవారి పెరు చెప్పగానే సిటీ లో 45 సీట్లు వచ్చాయి  ..45 మంది కార్పొరేటర్లు ఏం చేస్తున్నారు అని ఆలోచన కూడా ప్రజలు చేయడం లేదన్నారు. బీజేపీ టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు చేస్తున్నాయన్నారు.  అమిత్ షా.. కేసీఆర్ మధ్య నువ్వు గిచ్చినట్టు చెయ్..నేను కొరికినట్టు చెయ్ అన్నట్టు ఉందన్నారు.  ఇద్దరి మధ్య అవగాహన తోనే  రాజకీయం నడుస్తోందని..  రెండు పార్టీల మధ్య పంచాయతీ లో  కాంగ్రెస్ ని లేకుండా చేయాలని బీజేపీ కుట్ర జరుగుతోందన్నారు. 


కాంగ్రెస్ అంతర్గత కొట్లాట లోక కల్యాణం కోసమన్న జగ్గారెడ్డి 


కాంగ్రెస్  బలహీనతలు అడ్డం పెట్టుకుని బిజెపి రాజకీయ ఎత్తుగడ అవలంబిస్తుందిని విమర్శించారు.  ఈడీ .. ఐటీ అధికారులు మాట్లాడాల్సిన మాటలు కూడా బండి సంజయ్ మాట్లాడుతున్నారని..  ఈ రెండు డిపార్ట్మెంట్ లకు బండి సంజయ్ చీఫ్ అయ్యారా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  మల్లారెడ్డి టీడీపీలో ఉన్నప్పటి నుండి సంపాదించుకున్నారని.. అప్పుడెందుకు ఐటీ దాడులు చేయలేదని జగ్గరెడ్డి ప్రశ్నించారు. బీజేపీ ఐటీ, ఈడీని వాడుతూంటే.. కేసీఆర్  ఏసీబీ ని వాడుతున్నారన్నారు.  ఇద్దరు కొట్లాట తో ప్రజలకు ఏం లాభమని జగ్గారడ్డి ప్రశ్నించారు.  


బండి సంజయ్ ఎందుకు ఏడవాలి ?


గోవాలో కేసినోకు అనుమతులు ఉన్నాయన.ి.  అక్కడ అడే వాళ్ళను... తెలంగాణ కు వచ్చి దాడులు చేయడం ఎందుకని జగ్గారెడ్డి ప్రశ్నించారు.  గోవా లో ఆడించేది మీరు..ఇక్కడ దాడులు చేసేది మీరేనా అని ప్రశ్నించారు.  దేవుళ్ళ కాలం లో కూడా క్యాసినో..క్లబ్బు లు ఉన్నాయననారు. బండి సంజయ్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారన్నారు.  ఏం బాధ వచ్చింది బండి కని ప్రశ్నించారు. అమ్మకు బాలేకుంటే నో... అయ్యకు బాగలేకుంటే నో ఏడ్వాలని సలహా ఇచ్చారు.  


ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, నిందితుల కస్టడీ పిటిషన్ కొట్టేసిన ఏసీబీ కోర్టు!