Watch Video:
ఆన్‌లైన్ మోసం..
ఆన్‌లైన్‌లో ఆర్డర్‌లు ఇవ్వడం మన రోజువారీ పనుల్లో భాగమైపోయింది. ఈ హడావుడి లైఫ్‌లో బయటకు వెళ్లి తెచ్చుకునే ఖాళీ దొరకడం లేదు. అందుకే...ప్రతి చిన్న వస్తువునీ ఆన్‌లైన్‌లోనే కొనేస్తున్నాం. మన ఒళ్లు అలవకుండానే...ఇంటి ముందుకు వచ్చి మరీ ఇచ్చి వెళ్తారు. పైగా అప్పుడప్పుడూ ఆఫర్లు, డిస్కౌంట్‌లు పెట్టి ఊరిస్తాయి ఈ కార్ట్ సంస్థలు. అయితే...అన్ని సంస్థలూ జెన్యూన్‌గా ఉండవు. తక్కువ ధరకే విలువైన వస్తువులు ఇస్తామని చెప్తాయి. మనం ఆశపడి ఆన్‌లైన్‌లో పేమెంట్ చేసేస్తాం. తీరా ఆ ఆర్డర్ వచ్చిన తరవాత ప్యాక్ ఓపెన్ చేశాక కానీ తెలియదు ఆ కంపెనీ ఫేక్ అని. ఇప్పుడలాంటి ఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ ఫ్రాడ్ ఎంత దారుణంగా జరుగుతోందో తెలిపే వీడియో ఇది.
ఏం జరిగింది..?
ఓ వ్యక్తి ఆన్‌లైన్‌లో బ్రాండెడ్ ఇయర్‌ఫోన్స్ ఆర్డర్ చేశాడు. మెన్షన్ చేసిన అడ్రెస్‌కి సేల్స్‌మెన్ వచ్చి ఆర్డర్ డెలివరీ చేశాడు. చాలా ఉత్సాహంగా ఆ బాక్స్ ఓపెన్ చేయాలనుకున్నాడు కస్టమర్. ఎందుకైనా మంచిదని కెమెరా ఆన్ చేసి అన్‌బాక్సింగ్ వీడియో తీశాడు. పైన కవర్ తీసేయగానే... బ్రాండెడ్ ఇయర్ ఫోన్ బాక్స్ కనిపించింది. లోపల ఇయర్ ఫోన్స్ ఉన్నాయనే అనుకున్నాడు. అతనే కాదు. ఆ బాక్స్ కనిపించాక...ఎవరమైనా అంతే అనుకుంటాం. కానీ...ఆ బాక్స్ ఓపెన్ చేయగానే కస్టమర్‌కి షాక్ తగిలింది. ఇయర్‌ఫోన్స్ ఉన్నాయనుకుంటే 5 రూపాయల విలువ చేసే పార్లే జి బిస్కెట్ ప్యాకెట్ కనిపించింది. ఇది చూసి నమ్మలేకపోయాడు ఆ కస్టమర్. సోషల్ మీడియాలో కనిపించే లింక్‌లు క్లిక్ చేసి ఆర్డర్లు చేస్తే మోసపోతాం అనడానికి ఈ వీడియోనే ప్రత్యక్ష సాక్ష్యం. దీన్ని చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. అయితే...కొందరు ఇది ప్రాంక్ వీడియో అని కొట్టి పారేస్తున్నారు. ఇలాంటి వీడియోలు చూశాకైనా...ఆన్‌లైన్‌లో ఏది పడితే అది కొనద్దు అని ఇంకొందరు సలహా ఇస్తున్నారు.
Also Read: Global Recession: 'భారత్‌కు మాంద్యం ముప్పు లేదు- రాబోయే రోజుల్లో ఉద్యోగాలే ఉద్యోగాలు'