It Raids on BRS Mlc Kavitha House: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (Mlc Kavitha) షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు (IT Raids) జరుపుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ నుంచి వచ్చిన 12 మంది అధికారుల బృందం 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహిస్తోంది. ఇద్దరు మహిళా అధికారులతో సహా 10 మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. కవితతో పాటు ఆమె భర్త వ్యాపారాలపైనా ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు. ఈ క్రమంలో కవిత రెండు ఫోన్లను అధికారులు సీజ్ చేశారు. ఆమె స్టేట్ మెంట్ ను రికార్డు చేసినట్లు సమాచారం. మరోవైపు, కవిత నివాసం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
మరోవైపు, లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వేసిన పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 19కి వాయిదా వేసింది. లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ నోటీసులను సవాల్ చేస్తూ.. ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టొద్దని ఆమె పిటిషన్ దాఖలు చేశారు. దీంతో దర్యాప్తు సంస్థల ముందు ఆమె విచారణకు హాజరవ్వాలా.. వద్దా.. అనే దానిపై ఆ రోజు విచారణ కీలకంగా మారనుంది.
Mlc Kavitha: ఎమ్మెల్సీ కవిత నివాసంలో ఐటీ సోదాలు - 4 టీంలుగా ఏర్పడి తనిఖీలు, భారీగా పోలీసుల మోహరింపు
ABP Desam
Updated at:
15 Mar 2024 04:23 PM (IST)
BRS Mlc Kavitha: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరో షాక్ తగిలింది. బంజారాహిల్స్ లోని ఆమె నివాసంలో శుక్రవారం ఈడీ అధికారులతో కలిసి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంట్లో ఐటీ సోదాలు
NEXT
PREV
Published at:
15 Mar 2024 02:45 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -