KTR Criticise: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం మాంచి రసవత్తరంగా సాగుతోంది. ఏ చిన్న అంశం దొరికినా రాష్ట్ర ప్రభుత్వం పై అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ పార్టీ నాయకులు విమర్శల దాడి చేస్తున్నారు. మేమేం తక్కువ కాదు అన్నట్లుగా టీఆర్ఎస్ నాయకులు కూడా అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. రాష్ట్రానికి ఏమిచ్చారు.. ఏం చేశారని టీఆర్ఎస్ నాయకులు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రేంజ్ లో వైరం నడుస్తోంది. రాష్ట్రానికి చెందిన అంశాలపై బీజేపీ నాయకులు ప్రశ్నలు సంధిస్తుండగా.. దేశ ఆర్థిక పరిస్థితి, నిరుద్యోగం, రూపాయ విలువ పడిపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు విమర్శలు గుప్పిస్తున్నారు. మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే కేంద్ర సర్కారు నిధులను కేసీఆర్ ప్రభుత్వం పక్కదాని పట్టిస్తోందని బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు. తాజాగా మెడికల్ కాలేజీల విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ తీరును విమర్శించారు. 






కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్..


మీడియా మీటింగ్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా కొత్తగా 90 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని తెలిపారు. అందులో తెలంగాణ రాష్ట్రంలో 9 మెడికల్ ఏర్పాటు చేసినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. అయితే మెడికల్ కాలేజీల విషయంలో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ట్విట్టర్ వేదికగా కిషన్ రెడ్డిపై, కేంద్రంలోని మోదీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు బీజేపీ నాయకులు అసత్యాలు చెబుతున్నారని మండిపడ్డారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను పూర్తిగా ఖండిస్తున్నట్లు రాష్ట్ర మంత్రి తెతిలాపుర. మీ లాంటి కేంద్ర కేబినెట్ మంతిని నేనెప్పుడు చూడలేదని కేటీఆర్ అన్నారు. సోదరుడిగా మిమ్మల్ని గౌవిస్తాను కానీ.. మీరు చెప్పింది పూర్తిగా తప్పు అని ఘాటుగా జవాబు ఇచ్చారు. 


' గౌరవనీయులైన కిషన్ రెడ్డి గారూ.. ఓ సోదరుడిగా మిమ్మల్ని నేను గౌరవిస్తా, కానీ మీలా అసత్యాలు ప్రచారం చేసే కేంద్ర మంత్రిని నేను చూడలేదు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 9 మెడికల్ కాలేజీలను కేటాయించిందంటూ మీరు ప్రకటించింది పచ్చి అబద్ధం. మీకు ఈ అంశంలో క్షమాపణలు అడిగే ధైర్యం లేదు' అని కేటీఆర్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా విమర్శించారు. 'హైదరాబాద్ లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని గతంలో ప్రకటించారు. కానీ ఎప్పటిలాగే దాన్ని గుజరాత్ రాష్ట్రానికి తరలించారు. ఇంతలా రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా.. మీ తప్పులను సరిదిద్దుకోకుండా.. మళ్లీ రాష్ట్ర ప్రజలను మీ అసత్యాలతో తప్పుదోవ పట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన ఏ హామీని మీరు నిలబెట్టుకోకపోవడం సిగ్గు చేటు' అని కేటీఆర్ విమర్శించారు.