Train Accident Letter :  హౌరా నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలుకు అంటుకున్న మంటల విషయంలో అనుమానాలు తలెత్తుతున్నాయి.   షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. అయితే ఈ అగ్నిప్రమాదం ప్రమాదవశాత్తు జరిగిందా?.. లేక ఏదన్నా కుట్రకోణం దాగుందా అని అనుమానిస్తున్నారు. దీనికి కారణం  ఈ ప్రమాదం గురించి అధికారులను ముందుగానే ఓ అజ్ఞాతవ్యక్తి హెచ్చరించాడు. ఈ రోజు రైలు ప్రమాదం జరుగుతుందని గురువారం  దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఓ ఆకాశరామన్న లేఖ అందించింది. ఇప్పుడు ప్రమాదం జరిగిన తీరుతెన్నులను పరిశీలించిన అధికారులు కుట్ర కోణం దిశగా దర్యాప్తు చేస్తున్నారు.                    

  


ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో మొత్తం ఆరు బోగీలు దగ్ధమయ్యాయి. ఎస్-4, ఎస్-5, ఎస్-6, ఎస్-7 బోగీలు కాలి బూడిదయ్యాయి. బోగీల్లో పొగ గమనించగానే లోకో పైలెట్ ట్రైన్‌ను నిలిపివేశారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులంతా రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను రైలు నుంచి విడదీయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అందరూ సురక్షితంగా బయటపడ్డారని సౌత్‌ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిపింది.                              


ప్రయాణికులంతా అప్రమత్తమై వెంటనే దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. పగిడిపల్లి - బొమ్మాయిపల్లి మధ్యలో రైలు సికింద్రాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే ఓ వ్యక్తి అప్రమత్తమై చైన్ లాగాడు. దీంతో ప్రయాణికులంతా హుటాహుటిన రైలు దిగి వెళ్లిపోయారు. క్షణాల్లోనే రైలు నుంచి దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని కప్పేశాయి. మంటల్లో ఆరు బోగీలు పూర్తిగా తగులబడిపోయాయి.                                  


కాలిపోయిన బోగీలలో బెర్తులు ఉన్న వారిని బస్సుల్లో హైదరాబాద్ తరలించారు. అగ్నిప్రమాదానికి గురైన బోగీలు మినహా ఇతర వాటితో ఫలక్ నుమా ట్రైన్ సికింద్రాబాద్ స్టేషన్ కు చేరుకుంది.  ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్ ప్రమాదంతో పలు రైళ్లను రద్దు చేయగా.. మరికొన్ని రైళ్లను మళ్లించారు. రామన్నపేట రైల్వే స్టేషన్లో శబరి, నడికుడిలో రేపల్లె సికింద్రాబాద్ రైళ్లను నిలిపివేశారు. జన్మభూమి, నర్సాపుర్ రైళ్లు విజయవాడ మీదుగా మళ్ళించారు. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రైల్వే అధికారులు ఏర్పాట్లు చేయనున్నారు. సాయంత్రానికి ట్రాక్ క్లియరెన్స్ చేయనున్నారు.