KCR News : తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఈ సారి కాంగ్రెస్ చేతుల మీదుగా జరుగుతున్నాయి. తొమ్మిదేళ్ల పాటు కేసీఆర్ ఆధ్వర్యంలో సాగాయి. ఎన్నికలకు ముందు ఎనిమిది తర్వాత దశాబ్ది ఉత్సవాలు చేసేశారు. కానీ అవి ప్రారంభ వేడుకలని చెప్పారు. ఇప్పుడుఅసలు దశాబ్ది ఉత్సవాలు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ నిర్వహిస్తోంది.   తెలంగాణ ఇచ్చారన్న కారణంగా సోనియా గాంధీని ప్ర‌త్యేకంగా ఆహ్వానించారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్ర మొద‌టి సీఎంగా ఉన్న కేసీఆర్ ను ప్ర‌త్యేకంగా ఆహ్వానించాల‌ని సీఎం రేవంత్ ఆ బాధ్య‌త‌ను ప్ర‌భుత్వ స‌ల‌హాదారు హ‌ర్కార వేణుగోపాల్ కు అప్ప‌జెప్పారు.


స్వయంగా కేసీఆర్‌ను ఆహ్వానించాలను కుంటున్న  ప్రభుత్వ ప్రతినిధులు                                  


స్వయంగా కేసీఆర్‌కు ప్రభుత్వం తరపున అధికారిక ఆహ్వానం ఇవ్వాలని అనుకుంటున్నారు. అయితే హర్కర వేణుగోపాల్ ఎంత ప్ర‌య‌త్నించిన కేసీఆర్ అపాయింట్మెంట్ దొర‌క‌ట్లేద‌ని ఆయనను కలిసేందుకు కేసీఆర్ ఆసక్తిగా లేరని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.  గురువారం సాయంత్రం నుండి తాను కేసీఆర్ ను క‌లిసేందుకు ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా దొర‌క‌ట్లేద‌ని, కల‌వ‌కూడ‌ద‌ని అనుకున్నారేమోనని ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  బీఆర్ఎస్ నేత‌లు కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాంగా వేడుక‌లు చేస్తున్నార‌ని ఆరోపిస్తుండ‌గా… కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా సోనియాగాంధీ వ‌ల్లే తెలంగాణ క‌ల సాకారం అయ్యింద‌ని ఒప్పుకున్నార‌ని, అలాంట‌ప్పుడు ఆమెను పిలిచి గౌర‌విస్తే త‌ప్పేంద‌ని కాంగ్రెస్ నేత‌లు ప్ర‌శ్నిస్తున్నారు.


వేదికపై సోనియాకు మాత్రమే సన్మానం                                       


గతంలో కేసీఆర్ ను.. దశాబ్ది ఉత్సవాల్లో సన్మానిస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఆయనను సన్మానించే ఉద్దేశం లేదని సీఎంవో వర్గాలు తెలిపాయి. ఉద్యమకారులందరికీ ఆహ్వానం పంపుతున్నందున.. కేసీఆర్‌కు కూడా ఆహ్వానం పంపుతున్నారని.. ఇది  ప్రభుత్వ కార్యక్రమం అయినందున ప్రోటోకాల్ ప్రకారం ఆయనకు గౌరవ మర్యాదలు లభిస్తాయని కాంగ్రెస్ పార్టీ నేతలు అంటున్నారు. 


కేసీఆరే కాదు బీఆర్ఎస్ నుంచి ఎవరూ హాజరు కాకపోవచ్చు !                                               


తెలంగాణ విషయంలో తామే చాంపియన్లం అని అనుకుంటున్న బీఆర్ఎస్.. ఈ వేడుకలు హాజరయ్యే విషయంలో సందిగ్ధంలో ఉంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన వేడుకలకు కాంగ్రెస్ పార్టీ హాజరు కాలేదని గుర్తు  చేస్తున్నారు. చివరికి అమరవీరుల స్తూపం ఆవిష్కరణకు కూడా రాలేదని  గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ ను అవమానంచడానికే ఇలా అహ్వానిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అసలు సోనియాను ఏ హోదాలో ఆహ్వానించి.. సన్మానిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఆహ్వానం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానిది రాజకీయమేనని  బీఆర్ెస్ వర్గాలు ఓ క్లారిటీకి వచ్చాయి.