బంగారం లాగే వెండి ఆభరణాలకు కూడా ఈ రోజుల్లో మంచి వాల్యూ ఉంది. ఒకప్పుడు వెండిని కాళ్లకు మెట్టెలు, పట్టీలుగా మాత్రమే ధరించేవారు. బంగారం ధర చుక్కలను అంటిన తర్వాత వెండి ఆభరణాలకు ఆధరణ బాగా పెరిగింది. వెండి ధరించడం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. అదృష్టానికి కూడా మంచిదని శాస్త్రం చెబుతోందని పండితులు అంటున్నారు. మరి వెండి ఆభరణాలను ధరించడం వల్ల ఇంకా ఏయే ప్రయోజనాలు లభిస్తాయో చూద్దామా?


జ్యోతిష్యం ప్రకారం.. వెండి శుక్రుడు, చంద్రుడికి సంబంధించిన లోహం. చంద్రుడు మానసిక స్థితి, తెలివితేటలను ప్రభావితం చేస్తే.. శుక్రుడు విలాస వంతమైన జీవితాన్ని అందిస్తాడు. వెండిని ధరించడం ద్వారా ఈ రెండు గ్రహాల అనుగ్రహం లభిస్తుందట. వెండి అదృష్టాన్ని ఇచ్చే లోహంగా కూడా జోతిష్య నిపుణులు చెబుతున్నారు. వెండి ధరించే వారికి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుందట. రకరకాల వెండి ఆభరణాలు ధరించవచ్చు. ఇప్పటికే సంప్రదాయబద్ధంగా కాళ్లకు ధరించే పట్టీలు, గజ్జెలు, కడియాలు, మెట్టెల వంటివి ప్రాచూర్యంలో ఉన్నాయి. జ్యోతిషం వెండి ఆభరణాలు ధరిస్తే కలిగే లాభాలను వివరిస్తోంది. అదేమిటో తెలుసుకుందాం.



  • వెండి ఆభరణాలు ధరించే వారికి చంద్రుడి అనుగ్రహంతో అనారోగ్యాలను నివారించే సామర్థ్యం కలుగుతుంది. జీవితంలో ఆనందంగా, ప్రశాంతంగా సాగుతుంది.

  • వెండి ఆభరణాలు ధరించడం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. స్పష్టత ఏర్పడుతుంది. అందువల్ల సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు.

  • వెండి ఆభరణాలు ధరించడం వల్ల శుక్రుడు అనుకూలించి సంపద చేకూరుతుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.

  • వ్యక్తిగత చరిష్మా మెరుగుపడుతుంది. ఇతరులు మీ మాటకు విలువనిస్తారు.

  • వెండి ఆభరణాలు చెడు శక్తుల ప్రభావం నుంచి కాపాడుతాయి. క్ష్రుద్ర శక్తులు దరిచేరకుండా నిరోధిస్తాయి.

  • వృత్తి వ్యాపారాల్లో ఏర్పడిన ఆటంకాలు తొలగిపోయి కెరీర్ గాడిన పడుతుంది. క్రమంగా విజయాలు సొంతమవుతాయి.

  • వెండి ఆభరణాలు ధరించడం వల్ల జీవితంలో ఆవరించి ఉన్న ఒత్తిడి నెమ్మదిగా తొలగిపోయి ప్రశాంతత ఏర్పడుతుంది.

  • వెండి ఉంగరం జీవితంలోకి సంపద, అదృష్టాన్ని ఆకర్శిస్తుంది. ముఖ్యంగా వ్యాపారస్తులకు చాలా లాభదాయంగా ఉంటుంది.

  • ఉద్యోగస్తులు వెండి ఉంగరం ధరిస్తే వృత్తి ఉద్యోగాల్లో కొత్త ఎత్తులను అందుకుంటారు. త్వరత్వరగా పురోగతి సాధిస్తారని జ్యోతిష్యం వివరిస్తోంది.


బంగారు ఆభరణాలకు ఏ మాత్రం తీసిపోని అందమైన వెండి ఆభరణాలు ధరించి శుక్ర, చంద్రుల అనుగ్రహం పొంది జీవితాన్ని అబివృద్ధి పథంలో సాగించవచ్చని శాస్త్రం చెబుతోంది.


Also Read : Vastu Tips: కొత్తగా పెళ్లయ్యిందా? మీ బెడ్ రూమ్‌ను ఇలా అలంకరించుకుంటే.. సుఖం, సంపద!


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.