Is BJP the opposition in Telangana : పార్లమెంట్ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లు బీజేపీ మంచి విజయాలు నమోదు చేసింది. కాంగ్రెస్ తో పోటీగా ఎనిమిది సీట్లలో విజయం సాధించింది. బీజేపీ అనుకున్న ఫలితాలను సాధించింది. అధికార కాంగ్రెస్ కూడా ఎనిమిది స్థానాలను సాధించింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం ఎంపీ స్థానాల్లో ఉనికిని కోల్పోయింది. ఒక్కరంటే ఒక్కరూ విజయం సాధించలేదు. వచ్చే కొద్ది నెలల్లోనే బీజేపీనే ప్రధాన ప్రతిపక్షంగా మారే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదిగే చాన్స్
ప్రస్తుతం ఉన్న పాజిటివిటీని కాపాడుకుంటే.. బీజేపీ తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయవర్గాలంటున్నాయి. బీజేపీ అసెంబ్లీ ఎన్నికలకు ఆరేడు నెలల ముందు కూడా అత్యంత బలంగా ఉంది. కాంగ్రెస్ బలహీనంగా ఉంది. పోటీ బీఆర్ఎస్, బీజేపీ మధ్యనే జరుగుతుందన్న అభిప్రాయం కూడా వినిపించింది. అయితే బీజేపీ పెద్దలు తీసుకున్న కొన్ని అనూహ్య నిర్ణయాల వల్ల బీజేపీ వెనుకబడిపోయింది. కాంగ్రెస్ ఒక్క సారిగా ముందుకు వచ్చింది., బండి సంజయ్ ను మార్చేయడం.. కవితను ఎన్నికలకు ముందు అరెస్టు చేయకపోవడం వంటివి దెబ్బతీశాయని బీజేపీ నేతలు భావిస్తూ ఉంటారు.
అసెంబ్లీ కంటే పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకున్న బీజేపీ
అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది. ఎనిమిది స్థానాల్లో గెలిచింది. పదహారు శాతానికిపైగా ఓటు బ్యాంక్ సాధించింది. పార్లమెంట్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో పోటీ పడి ఓటు బ్యాంక్ తెచ్చుకుంది. కాంగ్రెస్ పార్టీకి నలభై శాతం ఓట్లను సాధిస్తే బీజేపీ 36 శాతం ఓట్లను సాధించింది. అందుకే ప్రజాతీర్పును గౌరవించి అసలైన ప్రతిపక్ష పార్టీగా వ్యవహరించి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తిరుగులేని శక్తిగా మారాలన్న లక్ష్యంతో బీజేపీ ఉంది. ప్రస్తుతం జరిగింది లోక్ సభ ఎన్నికలు కాబట్టి..జాతీయ స్థాయి అంశాలు, మోడీ హవా కీలకంగా మారాయని.. అదే అసెంబ్లీ స్థానాలకు వచ్చే సరికి సీన్ మారిపోతుందని ... చెబుతున్నారు. అందుకే..అసెంబ్లీకి కూడా బీజేపీ కేపబుల్ అనిపించేలా పార్టీని తీర్చిదిద్దాలని అనుకుంటున్నారు.
చేరికల్ని ప్రోత్సహిస్తారా ?
భారతీయ జనతాపార్టీ క్రమంగా బలపడుతోంది. రాష్ట్ర విభజన తరవాత జరిగిన ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకుని ఐదు చోట్ల గెలిచింది.తర్వాత టీడీపీ పూర్తిగా బలహీనపడింది. బీజేపీ మాత్రం బలపడుతూ వస్తోంది. ఇప్పుడుటీడీపీ అసలు లేదు. బీజేపీ మేజర్ ప్లేయర్ గా ఎదిగింది. బండి సంజయ్ చీఫ్ గా ఉన్నప్పుడు పార్టీకి జవసత్వాలు వచ్చాయి. ఇప్పుడు మరింతగా మెరుగైన ఫలితాలు సాధించారు. ముందు ముందు తెలంగాణలో బీజేపీ జోరును అడ్డుకోవడం ఇతర పార్టీలకు అంత తేలిక కాదు. ఈ వివిషయంపై అవగాహన ఉండబట్టే రాజకీయ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపించేం అవకాశం ఉంది. ముందు మందు చేరికల్ని ప్రోత్సహిస్తే మరింత బలపడే అవకాశం ఉంది.