WhatsApp Channel for Telangana CMO Latest News:
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఎప్పటికప్పుడూ సర్కార్ కు సంబంధించిన వార్తలను ప్రజలకు మరింత చేరువ చేయాలని భావిస్తోంది. ఇప్పటివరకూ ప్రజలకు ఎప్పటికప్పుడు అధికారిక సమాచారం, సేవలను చేరవేయడానికి అధునాతన సాంకేతిక మాధ్యమాలను, వేదికలను ఉపయోగించుకుంది. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయం (Telangana CMO WhatsApp Channel) ‘వాట్సాప్ చానెల్’ ను నేడు ప్రారంభించింది. ఈ వాట్సాప్ చానెల్ ద్వారా నెటిజన్లు ప్రభుత్వం సీఎంఓ విడుదల చేసే ప్రకటనలను పౌరులకు చెరవేస్తుందని అధికారులు తెలిపారు.
ఇందుకోసం ముఖ్యమంత్రి కార్యాలయ వాట్సాప్ చానెల్ ను (Telangana CMO) వినియోగించుకోవడం ద్వారా యూజర్లు సీఎం కేసీఆర్ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అయితే ఆసక్తి ఉన్నవారు సులువుగా తెలంగాణ సీఎంఓ వాట్సాప్ ఛానల్ లో చేరవచ్చు. ఇందుకోసం పెద్దగా ఇబ్బంది పడాల్సిందేమీ లేదు. కింద తెలిపిన పద్ధతిలో ఆసక్తిగల వారు సీఎంఓ చానెల్ లో చేరవచ్చు:
1. వాట్సాప్ అప్లికేషన్ ను తెరవండి.
2. మొబైల్ లో అయితే "Updates" అనే విభాగాన్ని ఎంచుకోవాలి. డెస్క్ టాప్ అయితే “Channels” ట్యాబ్ పైన క్లిక్ చేయాలి
3. తర్వాత “+” బటన్ పైన క్లిక్ చేసి “Find Channels” ను ఎంపిక చేసుకోండి.
4. టెక్స్ట్ బాక్స్ లో 'Telangana CMO' అని టైపు చేసి జాబితా నుండి చానెల్ ను ఎంచుకోవాలి. చానెల్ పేరు పక్కన ఒక ఆకుపచ్చని టిక్ మార్క్ (‘green tick mark’) ను నిర్ధారించుకోండి.
5. "Follow" బటన్ ని క్లిక్ చేసి తెలంగాణ సీఎంఓ చానెల్ లో చేరవచ్చు. దాంతో తెలంగాణ సీఎంఓ పంపే ప్రకటనలను నేరుగా వాట్సాప్ లోనే యూజర్లు చూడవచ్చు.
పైన ఇచ్చిన QR Code ను స్కాన్ చేయడం ద్వారా కూడా తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్ లో పౌరులు చేరవచ్చు. ‘తెలంగాణ సీఎంఓ వాట్సాప్ చానెల్’ ను ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి కార్యాలయం (సీఎం పీఆర్వో) సమన్వయంతో ఐటీ శాఖకు చెందిన డిజిటల్ మీడియా విభాగం నిర్వహిస్తుందని తెలిసిందే.