తెలంగాణలో బీఈడీ (BEd) కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియను ఉన్నత విద్యామండలి సెప్టెంబరు 20న ప్రారంభించింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం.. సెప్టెంబరు 20 నుంచి 30 మధ్య ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు సంబంధించి ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్ సెప్టెంబరు 25 నుంచి 29 వరకు నిర్వహించనున్నారు.


అభ్యర్థులకు అక్టోబ‌ర్ 3 నుంచి 5 వ‌ర‌కు వెబ్ ఆప్షన్లు న‌మోదు చేసుకోవడానికి అవకాశం కల్పించనున్నారు. అక్టోబ‌ర్ 6న వెబ్ ఆప్షన్లను ఎడిట్ చేసుకోవచ్చు. అభ్యర్థులకు అక్టోబ‌ర్ 9న మొదటి విడత సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబ‌ర్ 10 నుంచి 13 మ‌ధ్యలో సంబంధిత కళాశాలలో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అక్టోబరు 30 నుంచి త‌ర‌గ‌తులు ప్రారంభం కానున్నాయి.


టీఎస్ ఎడ్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూలు..


ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్, వెరిఫికేష‌న్, ఆన్‌లైన్ పేమెంట్‌ తేదీలు: సెప్టెంబరు 20 నుంచి 30 వరకు


ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్ అభ్యర్థుల‌కు ఫిజిక‌ల్ వెరిఫికేష‌న్: సెప్టెంబరు 25 నుంచి 29 వరకు.


వెబ్ ఆప్షన్ల న‌మోదు: అక్టోబ‌ర్ 3 నుంచి 5 వ‌ర‌కు. 


➥  వెబ్ ఆప్షన్ల సవరణకు అవకాశం: అక్టోబ‌ర్ 6. 


మొదటి విడత సీట్ల కేటాయింపు: అక్టోబ‌ర్ 9న. 


కళాశాలలో సెల్ఫ్ రిపోర్టింగ్: అక్టోబ‌ర్ 10 నుంచి 13 వరకు. 


➥  త‌ర‌గ‌తులు ప్రారంభం: అక్టోబరు 30 నుంచి.


తెలంగాణలో బీఈడీ ప్రవేశాల కోసం మే 18న నిర్వహించిన ఎడ్‌సెట్ ఫలితాలు జూన్ 12న విడుదలైన సంగతి తెలిసిందే. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (ఎంజీయూ) ఈ పరీక్ష నిర్వహించింది. రాష్ట్రవ్యాప్తంగా 49 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు 27,495 మంది అభ్యర్థులు హాజరుకాగా.. మొత్తం 26,994 అభ్యర్థులు (98.18%) ఉత్తీర్ణత సాధించారు. గతేడాది 211 ప్రభుత్వ, ప్రైవేట్‌ బీఈడీ కళాశాలల్లో మొత్తం 18,350 సీట్లకుగాను.. 13,756 మంది అభ్యర్థులు ప్రవేశాలు పొందారు.


కౌన్సెలింగ్ నోటిఫికేషన్


కౌన్సెలింగ్ వెబ్‌సైట్


ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్


ALSO READ:


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు, సీట్ల వివరాలు ఇలా!
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్‌, అహ్మదాబాద్‌, హరియాణా, మధ్యప్రదేశ్‌, అసోంలో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్‌లో మాస్టర్ డిగ్రీ కోర్సు, వివరాలు ఇలా
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్‌ఐడీ) 2023-2024 విద్యా సంవత్సరానికి సంబంధించి రెండేళ్ల మాస్టర్ ఆఫ్‌ డిజైన్‌(బీడిజైన్‌) కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. అహ్మదాబాద్‌, బెంగళూరు, గాంధీనగర్‌‌లో ఉన్న ఎన్‌ఐడీ క్యాంపస్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు డిసెంబరు 1లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. రెండు దశల రాతపరీక్ష ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సు పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...