Arya Samaj Marriage: ఆర్య సమాజ్‌ను 1875లో స్వామి దయానంద సరస్వతి స్థాపించారు. ఇది ఒక సంస్కరణవాద హిందూ సంస్థ, ఇది వేదాలను అత్యున్నతంగా పరిగణిస్తుంది. కట్నం, బాల్య వివాహం, సంక్లిష్టమైన ఆచారాల వంటి సామాజిక దురాచారాలను వ్యతిరేకిస్తుంది. సమాజంలోని చెడును వ్యతిరేకిస్తూ ఈ సమాజంలో సమాన హక్కులు కల్పించాలని చాటిచెబుతుంది. ఆర్య సమాజ్‌కు దేశవ్యాప్తంగా చాలా మందిరాలు ఉన్నాయని, ఇక్కడే వివాహాలు జరుగుతాయి. ఆర్య సమాజ్‌లో వివాహాలు ఎలా జరుగుతాయో? ఇక్కడ ముస్లిం మత వివాహాలు జరుగుతాయో లేదో తెలుసుకుందాం.
ఆర్య సమాజ్‌లో వివాహం కోసం షరతులు
ఆర్య సమాజ్‌లో హిందూ వివాహాల మాదిరిగానే వివాహం జరుగుతుంది. ఇక్కడ వివాహానికి ఆర్య సమాజ్ వాలిడేషన్ యాక్ట్ 1937, హిందూ వివాహ చట్టం 1955 కింద గుర్తింపు ఉంది. ఆర్య సమాజ్ ఆలయంలో వివాహం చేసుకోవడానికి వ్యక్తి హిందువేకానవసరం లేదు. బౌద్ధ, జైన, సిక్కు కూడా కావచ్చు. వివాహం చేసుకునే వారిలో ఎవరైనా ముస్లిం లేదా క్రైస్తవులైతే, వారి స్వచ్ఛందంగా శుద్ధి చేసిన తర్వాత, మొదట ఆర్య సమాజ్‌లో అంటే హిందూ మతంలోకి ప్రవేశిస్తారు. ఆ తర్వాత వారి వివాహం జరుగుతుంది. అందుకే ఏ ముస్లిం లేదా క్రైస్తవుడు ఆర్య సమాజ్ ఆలయంలో వివాహం చేసుకోలేరని చెప్పవచ్చు.
వివాహం కోసం ఇతర నియమాలు
ఆర్య సమాజ్‌లో వివాహం కోసం కొన్ని నియమాలు ఉన్నాయి, వీటిని పాటించాలి. ఇక్కడ వివాహం చేసుకోవడానికి ముందు, ఒక రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది ఆర్య సమాజ్ ఆలయంలోనే జరుగుతుంది. రిజిస్ట్రేషన్ కోసం ఇరుపక్షాలు గుర్తింపు, వయస్సును నిరూపించే పత్రాలు, ఆధార్ కార్డ్, పుట్టిన తేదీ సర్టిఫికెట్, ఇద్దరు సాక్షులు కావాలి. అబ్బాయి వయస్సు కనీసం 21 సంవత్సరాలు, అమ్మాయి 18 సంవత్సరాలు ఉండాలి. ఇద్దరి డాక్యుమెంట్లు పరిశీలించిన తర్వాత, పూలమాలలు మార్చుకోవడం జరుగుతుంది. అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేసే ఆచారం కూడా జరుగుతుంది. ఆ తర్వాత వివాహం జరుగుతుంది. వివాహం తర్వాత, ఆర్య సమాజ్ ఆలయం ఒక సర్టిఫికేట్ జారీ చేస్తుంది, అయితే చట్టపరమైన గుర్తింపు కోసం, దీనిని SDM కార్యాలయంలో హిందూ వివాహ చట్టం, 1955 లేదా ప్రత్యేక వివాహ చట్టం, 1954 కింద నమోదు చేసుకోవడం అవసరం. అయితే, దీనికి సంబంధించిన అనేక ముఖ్యమైన ప్రశ్నలు సుప్రీంకోర్టులో ఉన్నాయి.