Virat Kohli Owned Restaurant In Hyderabad: టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది.

హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

ఆహ్లాదకర వాతావరణం

వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 

 టీమిండియా స్టార్‌ బ్యాటర్‌, రికార్డుల రారాజు విరాట్‌ కోహ్లీ... సక్సెస్‌ఫుల్‌ క్రికెటర్‌గానే కాకుండా... ఓ సక్సెస్‌ఫుల్‌  వ్యాపారవేత్తగానూ ఎదుగుతున్నాడు. మైదానంలో పరుగల వరద పారించే కింగ్‌ కోహ్లీ... ఆతిథ్య రంగంలోనూ రాణిస్తున్నాడు. విరాట్ కోహ్లీ 2017లో వన్ 8 కమ్యూన్.. న్యూవా పేర్లతో చైన్ రెస్టారెంట్లను ప్రారంభించాడు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్లు ఇప్పటికే ఢిల్లీ, ముంబై, పుణే, కోల్‌కతా, బెంగళూరు సహా అనేక ప్రధాన నగారాల్లో ఆహార ప్రియుల మనసులు దోచుకున్నాయి. ఇప్పుడు ఈ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. హైటెక్ సిటీ ప్రాంతంలోని నాలెడ్జ్ సిటీలోని RMZ ది లాఫ్ట్‌లో కింగ్‌ కోహ్లీ వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ వన్ 8 కమ్యూన్‌ రెస్టారెంట్‌ను ప్రారంభించనున్నారు. ఇటీవలే విరాట్ కోహ్లీ సహా మరికొందరు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాళ్లు... హైదరాబాద్‌లో త్వరలో ప్రారంభించబోయే వన్ 8 కమ్యూన్‌లో కనిపించారు. అక్కడ కాసేపు సందడి చేశారు. ఆ ఫొటోలు సోషల్‌ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. హైదరాబాద్‌లో ప్రారంభించే కోహ్లీ రెస్టారెంట్ కోసం విరాట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. 

ఆహ్లాదకర వాతావరణం

వన్‌ 8 కమ్యూన్‌ రెస్టారెంట్ వాతావరణం... పూర్తిగా ఆహ్లాదకరంగా ఉండేలా రూపొందించారు. ఆహార ప్రియులకు మరపురాని జ్ఞాపకాలను అందించాలనే ఉద్దేశంతో ఈ రెస్టారెంట్‌ వాతావరణాన్ని అద్భుతంగా మలిచారు. వన్ 8 కమ్యూన్ రెస్టారెంట్‌ తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఒక ఫొటోను షేర్‌ చేసింది. ఈ ఫొటో వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రెస్టారెంట్ ఎప్పుడు ప్రారంభిస్తారన్న దానిపై ఇంకా స్పష్టత లేకపోయినా.. త్వరలోనే ఇది అందుబాటులోకి రానుంది. 

పరుగుల రారాజు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్ లో 43 బంతులలో 51 పరుగులను చేయటంతో తాజాగా మరో రికార్డును తన పేరిట లిఖించాడు. ఐపీఎల్ చరిత్రలో 10 సీజన్లలో 400కు పైగా పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ గా కోహ్లీ రికార్డును క్రియేట్ చేశాడు. ఐపీఎల్ 2024 సీజన్లో భాగంగా 400 రన్స్ ను పూర్తి చేసిన విరాట్ ఈ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 2011, 2013, 2015,2016,2018,2019,2020,2021,2023, 2024 సీజన్‌లలో కోహ్లి 400 పైగా పరుగులు సాధించాడు. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 9 మ్యాచ్‌లు ఆడిన కింగ్‌ కోహ్లి.. 430 పరుగులుచేశాడు. ఇదే మ్యాచ్ లో ఓపెనర్ గా విరాట్ కోహ్లీ 4,000 పరుగుల మైలును అందుకున్నాడు.