టీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ సీఎం కూతురు కవితను బీజేపీలోకి ఆహ్వానించారన్న వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. కాంగ్రెస్ నేతలతో కవిత టచ్ లో ఉన్నారనే వ్యాఖ్యలపై వివాదం మొదలైంది. కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని, తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమే అయి ఉండొచ్చునని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. బీజేపీ అరవింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. ఈ ఘటనపై కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గుల గనుల శాఖ మంత్రి ప్రహ్లద్ జోషి స్పందించారు. బీజేపీ ప్రభంజనాన్ని చూసి తట్టుకోలేక, నిరాశ లోనై బీజేపీ ప్రజాప్రతినిధుల ఇండ్లపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు. ఏవరైనా నేతలు కామెంట్లు చేస్తే అందుకు ఆ నేత క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుందని, కానీ దాడులు చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు.
కేటీఆర్, కవిత వచ్చినా సాధరంగా ఆహ్వానిస్తాం..
ప్రధాని అవాజ్ యోజన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక పోతున్న కేసీఆర్ ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ రాష్ట్రానికి వస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు ముఖం చాటేస్తున్నారని ప్రశ్నించారు. తాను చేసిన తప్పులు తప్పించుకొనికే ముఖం చూపించే ధైర్యం లేకే కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని విమర్శించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్న బీజేపీ.. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొంటున్నారని ఆరోపించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బీజేపీలోకి మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత ఇలా ఎవ్వరు వచ్చినా సాధరంగా ఆహ్వానం పలుకుతామని కేంద్రమంత్రి ప్రహ్లద్ జోషి చెప్పారు. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన ఘనత కేసీఆర్ దే అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలకు అదుపేలేకుండా పోతుంతన్నారు. ఒడిషా గనుల పై మంచి లాభాన్ని గడిస్తుంటే , తెలంగాణలో గనుల వచ్చే రాబడిని ప్రభుత్వం సద్వినియోగం చేసుకోకుండా పోతుందన్నారు.
ఎంపీ అర్వింద్ ఏమన్నారంటే..
తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబం కుల అహంకారంతో మిడిసిపడుతోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. కేసీఆర్, కేటీఆర్, కవిత ఆదేశాలతోనే తన ఇంటిపై టీఆర్ఎస్ గూండాలు దాడి చేశారని ఆయన ఆరోపించారు. హైదరాబాద్‌లోని అర్వింద్ ఇంటిపై దాడి చేయడం..తర్వాత కవిత చెప్పుతో కొడతానని హెచ్చరించిన తర్వాత ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. కవితపై తానేం అసభ్యకరంగా మాట్లాడలేదన్నారు. అసత్య ప్రచారం చేయలేదన్నారు. కాంగ్రెస్‌లో చేరేందుకు ఖర్గేను.., కవిత కలిసిందని తాను చెప్పలేదని.. స్పష్టం చేశారు.
టచ్‌లో ఉన్నారని ఆ పార్టీ ఆఫీస్ బేరర్ చెప్పారు: అర్వింద్
కాంగ్రెస్ నేతతో టచ్ లో ఉన్నారని ఆ పార్టీ సీనియర్ ఆఫీస్ బేరర్ చెప్పారని ఆ మాటకు కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తన ఆరోపణలపై కవిత ఇంతగా రియాక్ట్ అయిందంటే అది నిజమై ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అందరి ఫోన్లు ట్యాప్ చేసే కేసీఆర్ తన బిడ్డ కాల్ లిస్ట్ తీస్తే నిజానిజాలు బయటకొస్తాయని అన్నారు. తన బిడ్డకు బీజేపోళ్లు ఫోన్ చేసిండని స్వయంగా కవిత తండ్రి కేసీఆర్ చెప్పిన విషయాన్ని అర్వింద్ గుర్తు చేశారు. తనకు కాంగ్రెస్ తో పాటు టీఆర్ఎస్ వాళ్లు కూడా టచ్లో ఉన్నారని స్పష్టం చేశారు.