Birmingham Fire Accident: అమెరికాలోని బర్మింగ్‌హామ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో పదిమంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన విద్యార్థులు ఒక అపార్టమెంట్‌లో నివశిస్తున్నారు. అందులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వారిలో కొందరు అతికష్టమ్మీద తప్పించుకున్నారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు.
హఠాత్తుగా చెలరేగిన మంటలు రావడంతో ఏం జరుగుతుందో తెలియక విద్యార్థులు ఉక్కిరిబిక్కిరయ్యారు. అపార్ట్‌మెంట్‌లో ఫైర్ ప్రారంభమై కాసేపటిలోనే ఘాటైన పొగ వ్యాపించింది. ఎటు వెళ్లాలో తెలియక ఇబ్బంది పడ్డారు. విద్యార్థులు శ్వాస తీసుకోలేక భయంతో అరుస్తూ పరుగులు పెట్టారు.
వెంటనే సమాచారం అందుకున్న అధికారులు స్పాట్‌కు వచ్చారు. అపార్టమెంట్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులను బయటకు తీసుకొని వచ్చారు. వారిలో ఇద్దరి విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వారిద్దరు మరణించారు.
ప్రమాదంలో చిక్కుకొని చనిపోయిన ఇద్దరు విద్యార్థులుకూడా హైదరాబాద్ చెందిన వారే. మృతి చెందిన వారిలో ఉడుముల సహజ రెడ్డి కాగా మరో విద్యార్థి కూకట్ పల్లికి చెందిన యువతి. వీళ్లంతా అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నారు.