Hyderabad  4 crore cash seize :కోట్ల రూపాయల నగదును తరలిస్తున్న కారును బోయినపల్లి పోలీసులు ఛేజ్ చేసిపట్టుకున్నారు.  ముఠాను 15 కిలోమీటర్లు వెంబడించి చాకచక్యంగా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాహనంలో దాచిన రూ. 4 కోట్ల హవాలా డబ్బును స్వాధీనం చేసుకున్నారు. కారు డిక్కీ, టైర్లు, బానెట్, సీట్లలో కనిపించకుండా డబ్బు కట్టలు దాచి పెట్టారు.  

Continues below advertisement

బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద కారును గుర్తించిన పోలీసులు, వాహనాన్ని ఆపాలని సూచించారు. అయితే, ముఠా సభ్యులు పారిపోయే ప్రయత్నం చేయడంతో, పోలీసులు 15 కిలోమీటర్లు చేజ్ చేసి చివరికి అదుపులోకి తీసుకున్నారు.  

Continues below advertisement

కారు తనిఖీలో, డిక్కీలో, టైర్లలో, బానెట్‌లో, సీట్ల కింద కనిపించకుండా దాచిన డబ్బు కట్టలు బయటపడ్డాయి. మొత్తం రూ. 4 కోట్ల విలువైన హవాలా డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా సభ్యులు ఎవరు, డబ్బు మూలాలు ఏమిటి అనే వివరాలు ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఇది పెద్ద హవాలా నెట్‌వర్క్ భాగమని అనుమానిస్తున్నారు. బోయిన్‌పల్లి పోలీసులు ముఠా సభ్యులను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి తరలించాలనుకున్నారు అనే అంశాలపై విచారణ జరుపుతున్నారు. హవాలా రాకెట్‌లపై పోలీసులు  నిఘా పెట్టి తనిఖీలు చేస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .