Telangana Crime News: మెదక్ జిల్లా చేగుంట 44వ జాతీయ రహదారి వడియారం బైపాస్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ బలంగా ఢీ కొట్టింది. ఈ దుర్ఘటనలో వెనుక లారీ క్యాబిన్‌లో నలుగు స్పాట్‌లోనే చనిపోయారు. ముందు లారీ క్యాబిన్‌లో ఉన్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే స్థానికంగా ఉన్న ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితిగా కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతుననారు. మృతుల వివరాలు, క్షతగాత్రుల వివరాలు తెలియాల్సి ఉంది.