VC Sajjanar: ప్రజల మనసులో చెరగని ముద్ర వేయించుకొనే లక్ష్యంతో తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) సందర్భాలకు తగ్గట్టుగా ముందుకు పోతోంది. పండుగలు, జాతరలు సహా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో జనం దృష్టిని తనవైపు తిప్పుకొనేలా టీఎస్ఆర్టీసీ (TSRTC) ఆఫర్లను ప్రకటిస్తూ వస్తోంది. తాజాగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా అతివలను ఆకట్టుకొనే ఆఫర్‌తో తెలంగాణ ఆర్టీసీ ముందుకు వచ్చింది.
మహిళల కోసం టీఎస్‌ఆర్టీసీ (TSRTC New Offers) పలు ఆఫర్లు ప్రకటించింది. హైదరాబాద్ నగరంలో మహిళా ప్రయాణికుల కోసం.. రోజులో రద్దీ ఎక్కువగా ఉండే సమయంలో 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. అంతేకాకుండా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం 8వ తేదీన ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలంగాణ ఆర్టీసీ ప్రకటించింది. ఈ మేరకు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ ప్రకటించారు.
రాష్ట్రంలోని ముఖ్య బస్ స్టేషన్లలో మహిళా వ్యాపారులు, ఎన్‌హెచ్‌జీ లేదా డ్వాక్రా గ్రూప్‌ల ద్వారా ఉత్పత్తులు సేల్స్ కోసం ఉచిత స్టాల్స్, స్పేసెస్‌ను మార్చి 31వ తేదీ వరకు ఉచితంగా అందించాలని సంస్థ నిర్ణయించింది.మహిళా వ్యాపారులకు మార్చి 31 వరకూ ఉచిత స్టాళ్లు కేటాయిస్తారు. అంతేకాకుండా, మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా 30 డ్రైవింగ్ శిక్షణ సంస్థల్లో 30 రోజుల పాటు భారీ వాహనాలు నడిపేలా డ్రైవింగ్‌లో ఉచిత శిక్షణ ఇప్పించనున్నారు. అయితే, ఈ సౌకర్యం పొందాలనుకొనే మహిళా అభ్యర్థినులకు తప్పనిసరిగా ఎల్.ఎం.వీ. లైసెన్సు, రెండేళ్ల అనుభవం కూడా ఉండాల్సి ఉంటుంది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోజువారీ పాస్ అయిన టీ-24 టిక్కెట్‌పై మార్చి 8 నుంచి 14 వరకూ 20 శాతం డిస్కౌంట్‌ను ఇవ్వనున్నారు. వరంగల్‌లోనూ ఈ రాయితీ వర్తించనుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు ఆర్డినరీ, లేదా ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కినట్లయితే, వారి సౌకర్యార్థం రెండు చొప్పున సీట్లను కేటాయించున్నారు. అంతేకాక, మహిళలకు లక్కీ డ్రా సదుపాయం కూడా బస్సు ప్రక మార్చి 31 వరకూ మహిళా ప్రయాణికులకు లక్కీ డ్రా ద్వారా బహుమతులిస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన వారికి నెల రోజుల పాటు డిపో నుంచి 30 కిలో మీటర్ల పరిధిలో ఉచితంగా ప్రయాణంతో పాటు ప్రత్యేక బహుమతులు కూడా ఉండనున్నాయి. లక్కీ డ్రాలో పాల్గొనడం కోసం.. ప్రయాణి టిక్కెట్‌తో పాటు, ప్రయాణికురాలి ఫొటో 94409 70000 నంబరుకు వాట్సాప్‌లో పంపొచ్చు’’ అని గోవర్ధన్, సజ్జనార్ తెలిపారు.