సంక్రాంతి పండగ వచ్చేసింది. పట్టణాల్లోని వారంతా పల్లెలకు పయనమవుతున్నారు. మరోవైపు ప్రైవేటు ట్రావెల్స్ ప్రయాణికుల దగ్గర ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తున్నారు. బస్ స్టాప్ కి వెళ్లి.. ప్రయాణించాలంటే.. ఒకటే రద్దీ. ఇలా ఫీల్ అయ్యేవారి కోసం ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.


పండగ కోసం ఇంటికి వెళ్లే వారి కోసం.. టీఎస్ఆర్టీసీ మరో కొత్త నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. ప్రయాణికుల దగ్గరికే ఆర్టీసీ బస్సు వెళ్లనుంది. దీనికి సంబంధించి సమన్వయం చేసుకునేందుకు.. ఆర్టీసీ అధికారుల నంబర్లను సైతం ట్విట్టర్ లో పోస్టు చేశారు. అయితే సొంత ఊరికి నేరుగా బస్సులో వెళ్లాలనుకునేవారు.. ఆ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడాలి. కానీ ముప్పై మంది ప్రయాణికులు తప్పనిసరిగా ఉండాలి. అలా ఉంటేనే మీ వద్దకు బస్సు వస్తుంది.






ఒకే ఊరికి దగ్గరలో ఉన్నవాళ్లకు ఇది ఎంతో ఉపయోగకరం. సిటీలోని కాలనీ వాసులతో పాటు , ఆయా ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులు, కార్మికులకు  ప్రయాణం సులభం అవనుంది. జిల్లాల వారిగానూ ఉపయోగం ఉంటుంది. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో.. ఇలా ఒకే ఏరియాకు సంబంధించిన వారు.. 30 మంది ఉంటే.. ఆర్టీసీ బస్ బుక్ చేసుకుని  వెళ్లొచ్చు.


ప్రత్యేక బస్సులు







సంక్రాంతి పండగ సందర్భంగా.. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనుంది టీఎస్ఆర్టీసీ. జనవరి 7వ తేదీ నుంచి 14 వరకు ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ ఏంటంటే.. ఈ ప్రత్యేక బస్సులు ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయడం లేదని తెలిపింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 4,318 ప్రత్యేక బస్సులను నడపనున్నారు.  పండగ సందర్భంగా నడిపే ప్రత్యేక బస్సులకు ఎలాంటి అదనపు ఛార్జీలు.. వసూలు చేయడంలేదని ఆర్టీసీ ఛైర్మన్​ బాజిరెడ్డి గోవర్ధన్ చెప్పారు.









హైదరాబాద్ ఎంజీబీస్, జేబీఎస్, సీబీఎస్​, ఉప్పల్​ క్రాస్​​రోడ్, ఎల్​బీనగర్​, ఆరాంఘర్​, లింగంపల్లి, చందానగర్, ఈసీఐఎల్​, కేపీహెచ్​బీ, ఎస్​ఆర్​నగర్​, అమీర్​పేట, టెలిఫోన్​భవన్, దిల్​సుఖ్​నగర్​ నుంచి బస్సులు నడపనున్నారు. అంతేగాకుండా.. జంట నగరాల్లోని వివిధ శివారు కాలనీల్లో ముఖ్యమైన స్టాపుల నుంచి బస్సులు ఉండనున్నాయి. ముందస్తు రిజర్వేషన్ కోసం..  www.tsrtconline.in వెబ్​సైట్​లోకి వెళ్లాలి. ప్రత్యేక బస్సులను సమన్వయం చేసేందుకు సిబ్బందిని కూడా నియమించినట్టు ఆర్టీసీ తెలిపింది. నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్​నగర్, నల్గొండ, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, సిద్దిపేటతోపాటు ముఖ్యమైన పట్టణాలకు టీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనున్నారు. 




సొంతూళ్లకు వెళ్లే ప్రజల కోసం 4,360 బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు టీఎస్ఆర్టీసీ చెప్పింది. అయితే ప్రత్యేక బస్సుల్లో 590 బస్సులకు రిజర్వేషన్ చేసుకునే సౌకర్యం ఉంటుంది. ఆదిలాబాద్, ఖమ్మం, భద్రాచలం, విజయవాడ, నెల్లూరు, గంటూరు, ఒంగోలు పట్టణాలతో పాటు.. కర్ణాటక, మహారాష్ట్రలకు బస్సులకు రిజర్వేషన్ సౌకర్యం ఉంటుంది. ఏ విధమైన అదనపు అదనపు ఛార్జీలను వసూలు చేయడం లేదని టీఎస్ఆర్టీసీ పేర్కొంది.




Also Read: