TSRTC Special Buses: తెలంగాణలో దసరా, బతుకమ్మ పండుగలకు బాగా గుర్తింపు ఉంది. తెలంగాణ వాసులు ఈ పండుగలకు ఇచ్చే విలువ గురించి అందరికీ తెలిసిందే. ఎవరు ఎక్కడ ఉన్న సరే.. ఈ పండుగలకు సొంత గ్రామాలకు చేరుతుంటారు. ఈసారి దసరాకు ఏకంగా 15 రోజులు సెలవులు వస్తుండడంతో విద్య, ఉద్యోగం, వ్యాపారం అవసరాల దృష్ట్యా హైదరాబాద్ లో స్థిరపడ్డ ప్రజలు పెద్ద ఎత్తున జిల్లాలకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికుల కోసం శుభవార్త తెలిపింది. ఈసారి జిల్లాలకు ఏకంగా 3,500 స్పెషల్ బస్సులను నడిపించేందుకు ఆర్టీసీ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను అనుమతి కోసం ఆర్టీసీ అధికారులు సీఎండీ పంపినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే ఈనెల 24వ తేదీ నుంచి వచ్చే నెల 7 వరకు దసరా స్పెషల్ బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. 


రంగారెడ్డి రీజియన్ నుంచి 3500 ఆర్టీసీ బస్సులను జిల్లాలకు నడపనున్నారు. ఇదిలా ఉంటే కేవలం జేబీఎస్, ఎంజీబీఎస్ నుంచే కాకుండా హైదరాబాద్ లోని పలు ప్రధాన ప్రాంతాలైన కోఠి, ఎల్బీ నగర్, ఉప్పల్, కూకట్ పల్లి, మియాపూర్ నుంచి జిల్లాలకు ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. మరో రెండు రోజుల్లో ఈ ప్రత్యేక బస్సులకు సంబంధించి పూర్తి సమాచారం వెలువడనుంది. ఇదిలా ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 25వ తేదీ నుంచి అక్టోబర్ 9వ తేదీ వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. వీటితో పాటు మరో రెండు ఆదివారాలు కలుపుకొని ఈసారి దసరా సెలవులు మొత్తం 15 రోజులు లభించనున్నాయి. 


నగదు లేకున్నా ప్రయాణించి ఫెసిలిటీ కూడా ఉందండోయ్..


చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఆర్టీసీ బస్సు ఎక్కాలంటే తెగ ఆలోచించేవాళ్లం. కానీ ఇప్పుడా సమస్య లేకుండా పోయింది. చేతిలో చిల్లర లేకున్నా, అకౌంట్లో డబ్బులు ఉంటే చాలు. చేతిలో నగదు లేకపోయినా పేమెంట్ నడిచేలా ఏర్పాట్లు చేశారు తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం. అదెలా అనుకుంటున్నారా.. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా. బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన చరవాణి, క్రెడిక్, డెబిట్ కార్టుల క్యూఆర్ కోడ్ తో యూపీఐ పేమెంట్లు తీసుకోబోతున్నారు. ఆర్టీసీలో ఎక్కడికి వెళ్లినా చేతిలో కార్డులు, మొబైల్ ఫోన్ ఉంటే చాలు. కరీంనగర్ రీజియన్ లో దూరప్రాత బస్సు సర్వీసుల్లో అమలు చేస్తున్నారు. 


ఇప్పటికే గ్రేటర్ లో ఉండగా.. తాజాగా కరీంనగర్ లో! 


ప్రయాణికుల ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు టీఎస్ఆర్టీసీ.. తాజాగా ఐ -టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూ మిషన్) ల ద్వారా బస్సుల్లో నగదు రహిత టికెట్ కొనుగోలు అందుబాటులోకి తెచ్చింది. డెబిట్, క్రెడిట్ కార్డులతో స్వైపింగ్, క్యూఆర్ కోడ్ తో టికెట్ల కొనుగోలు చేసే సదుపాయం కల్పించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ లో ఈ పద్ధతిని అమలు చేస్తుండగా.. తాజాగా కరీంనగర్ రీజియన్ లో ప్రవేశ పెట్టారు. తెలగాణ వ్యాప్తంగా 928 ఐ - టిమ్ములు కొనుగోలు చేయగా.. కరీంనగర్ రీజియన్ లో 10 డిపోలకు కలిపి 73 ఔ - టిమ్ములు, 36 సిమ్ములు వచ్చాయి. గరుడ, గరుడ ప్లస్, రాజధాని, హైటెక్, సూపర్ లగ్జరీ (కొన్నింటిలో) బస్సు సర్వీసుల్లో నగదు రహిత సేవలు అందించాలని నిర్ణయించారు.