TSRTC News: చాలా మంది బస్టాండులో వేచి చూస్తూ.. బస్సు ఎప్పుడు వస్తుందో తెలియక తెగ ఇబ్బంది పడుతుంటారు. పక్కనున్న వాళ్లను అటెళ్లే బస్సు ఎప్పుడు వస్తుంది, ఇటు వెళ్లే బస్సు ఏ సమయానికి వస్తుందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తారు. కానీ వాళ్లు కూడా తెలియదని చెప్పడంతో.. సతమతమవుతూ ఉంటారు. కానీ టీఎస్ఆర్టీసీ ఇప్పుడు ఆ సమస్యను తీర్చనుంది. ట్రిప్పు తగ్గకుండా, రద్దు అవకుండా, మధ్యలోనే మలుపు తిరిగి వెనక్కి వెళ్లకుండా నిర్దేశించిన సర్వీసులన్నీ రోడ్డెక్కి తిరిగేలా టీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఇందుకు వీటీఎస్ (వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్) ను అన్ని బస్సులకు సమకూర్చనుంది. గతంలో మెట్రో బస్సులకు జీపీఎస్ ను అమర్చి బస్సు ఎక్కడుందో ట్రాక్ చేశారు.
మొత్తం 2850 బస్సుల్లో అందుబాటులో..
కరోనాతో దీన్ని అమలు చేయలేకపోయారు. కానీ విమానాశ్రయానికి వెళ్లే బస్సుల్లో ఇటీవల అమలు చేయడం, ప్రయాణికుల సమఖ్య పెరగడంతో సిటీ బస్సుల్లో కూడా వీటిని అమలు చేయాలని నిర్ణయించారు. ఈ దిశగా మెట్రో బస్సులతో మొదలు పెడుతున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఈడీ యాదగిరి చెప్పారు. మొత్తం 2,850 బస్సులు ఉండగా.. అందులో 1350 మెట్రో ఎక్స్ ప్రెస్ లు ఉన్నాయి. వీటి కాల పరిమితి కూడా మరో నాలుగైదేళ్లు ఉండడంతో ఈ బస్సులకు కూడా వీటీఎస్ ను అమర్చుతున్నారు.
ట్రిప్పులు రద్దైనా, బస్సు ఆలస్యమైనా క్షణాల్లోనే తెలుస్తుంది..!
హైదరాబాద్ మహా నగరంలో ప్రస్తుతం 28 వేల ట్రిప్పులు నడుస్తున్నాయి. ఇవి ఎక్కడా రద్దు అవకుండా.. అర్ధంతరంగా ఆపేయకుండా.. చూడాలని ఆర్టీసీ ప్రయత్నిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ సిటీ బస్సు అనే యాప్ ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చి బస్సుల సమాచారం అందించనున్నారు. ఎక్కడ ఉన్నారు, ఏ మార్గంలో ప్రయాణిస్తారు వంటి వివరాలు ఆ యాప్ లో పొందుపరిస్తే నడిచే బస్సులు రూటు నంబర్లతో సమాచాలం సెల్ ఫోన్ లో అందుతుంది. ఆ ప్రకారం బస్సు ఏ సమయంలో వస్తుందో తెలుసుకుని బస్టాపుకు చేరుకోవచ్చు. బాగా ఆలస్యం అవుతుంది అనుకుంటే క్యాబు, ఆటోల్లో వెళ్లిపోవచ్చు.
మొన్నటికి మొన్న స్లపీర్ బస్సులను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. బుధవారం నుంచి స్లీపర్ స్సులు అందుబాటులోకి రానున్నాయి. ఇలా టీఎస్ఆర్టీసీకి 10 బస్సులు సమకూరాయి. వీటిలో పూర్తి స్లీపర్ బస్సులు 4 కాగా.. 6 స్లీపర్ కమ్ సీటర్ బస్సులు ఉన్నాయి. ఇవి హైదరాబాద్ - కాకినాడ, హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు సాగించనున్నాయి. కేపీహెచ్‌బీ కాలనీ బస్సు స్టాపు దగ్గర బుధవారం సాయంత్రం 4 గంటలకు వీటిని టీఎస్ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ప్రారంభిస్తారు.
బస్సు టైమింగ్స్ ఇవే..!
- కాకినాడ వైపు వెళ్లే బస్సులు హైదరాబాద్ బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయి. ప్రతిరోజూ రాత్రి 7.45, 8.30 గంటలకు బయలుదేరుతాయి. కాకినాడ నుంచి హైదరాబాద్ కు రాత్రి 7.15 గంటలకు, 7.45 గంటలకు తిరుగు ప్రయాణం అవుతాయి.
- విజయవాడ వైపు వెళ్లే బస్సులు ప్రతిరోజూ మియాపూర్ నుంచి ఉదయం 9.30, 10.45, 11.45 గంటలకు, రాత్రి 9.30, 10.15, 11.15 గంటలకు బయలుదేరుతాయి. విజయవాడ నుంచి ఉదం 10.15, 11.15 మధ్యాహ్నం 12.15 గంటలకు, అర్ధరాత్రి 12.00, 12.45 గంటలకు తిరుకు ప్రయాణం అవుతాయి.