TSRTC Invites Entries for Short Films: తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) పై ప్రజల్లో మరింత నమ్మకం కలిగించి, చేరువ చేసేందుకు టీఎస్ఆర్టీసీ (TSRTC) వినూత్న నిర్ణయంతో ముందుకు వచ్చారు. షార్ట్ ఫిల్మ్ (Short Films) చేసి జనాల్ని ఆకట్టుకోవాలని భావిస్తున్నారు. అందుకోసం షార్ట్ ఫిల్మ్‌ల రూపకర్తల నుంచి ఎంట్రీలను ఆహ్వానిస్తున్నారు. ఈ ప్రకటన జారీ చేశారు. వచ్చిన షార్ట్ ఫిల్ముల నుంచి మెరుగ్గా ఉన్న వాటిని ఎంపిక చేసి వాటిలో మొదటి బహుమతి కింద రూ.10 వేలు, రెండో ఉత్తమ చిత్రంగా ఎంపికైతే రూ.5 వేలు, మూడో ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌కు రూ.2,500 చొప్పున పురస్కారం ఇవ్వనున్నట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. కన్సోలేషన్ బహుమతుల కింద మరో 10 మందికి కూడా బహుమతులు ఉంటాయని వివరించారు.
ఆర్టీసీ షార్ట్ ఫిల్ములు (TSRTC Invites Short Films) తీయాలనుకునే వారు ఈ అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని రూపొందించాల్సి ఉంటుంది.
* సురక్షితమైన ఆర్టీసీ (TSRTC News) ప్రయాణం
* లీటర్ పెట్రోల్ కన్నా తక్కువ ధరకే రూ.100 కే రోజంతా హైదరాబాద్ బస్సుల్లో ప్రయాణం
* పెళ్లిళ్లు, ఇతర శుభ కార్యాలకు ఆర్టీసీ బస్సులను (RTC Buses Private Bookings) బుక్ చేసుకుంటే ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు పంపే వెసులుబాటు
* టీఎస్ ఆర్టీసీ కార్గో సేవలు (TSRTC Cargo Services)
* గరుడ, రాజధాని ఏసీ బస్సుల్లో ఉండే సౌకర్యాలు
ఆసక్తికల వారు రూపొందించే షార్ట్ ఫిల్మ్ వీడియో 120 సెకండ్లకు (2 నిమిషాలు) మించకూడదు. ఈ ఆర్టీసీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ లో (TSRTC Short Film Contest) పాల్గొనాలనుకునేవారు tsrtcshortfilm@gmail.com కు ఈ - మెయిల్ పంపవచ్చు. ఈ ఎంట్రీలకు చివరి తేదీ ఏప్రిల్ 21 మాత్రమే.