తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) నిర్వహించబోయే పరీక్షకు సంబంధించిన పేపర్ లీక్ అవ్వడం రాష్ట్రంలో సంచలనం అయిన సంగతి తెలిసిందే. టీఎస్పీఎస్సీకి సంబంధించిన సర్వర్ హ్యాక్ అవ్వడం వల్లే ఇలా జరిగిందని, అందుకే నేడు జరగాల్సిన పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే, ఈ పేపర్ లీక్ వ్యవహారంలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అసలు హ్యాకింగే జరగలేదని తేల్చారు. టీఎస్పీఎస్సీలోనే పని చేసే ఓ ఉద్యోగే పేపర్‌ను ఉద్దేశ పూర్వకంగా లీక్ చేసిన విషయం బయటికి వచ్చింది. ఓ యువతి కోసం పేపర్‌ లీక్‌ చేసినట్టు తెలిసింది. హానీట్రాప్‌ జరిగినట్టు తెలుస్తోంది. నిందితుడిని టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్ ను పోలీసులు నిందితుడిగా గుర్తించారు. దీంతో నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


పోలీసులు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి ఇటీవల తరచుగా ఓ అమ్మాయి రావడాన్ని గమనించారు. ప్రవీణ్‌ కోసమే ఆమె వస్తున్నట్లుగా గుర్తించారు. టీఎస్‌పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌ కుమార్‌కు గాలం వేస్తూ సన్నిహితంగా ఉంది. ఈ క్రమంలో తనకు ఎక్సామ్ పేపర్‌ ఇవ్వాలని కోరింది. ఆమె కోసమే ప్రవీణ్ పేపర్‌ లీక్‌ చేసినట్టు గుర్తించారు. యువతి కోసమే టౌన్‌ ప్లానింగ్‌ పేపర్‌ లీకేజీ జరిగిందని అధికారులు గుర్తించారు. దీంతో నిందితుడు ప్రవీణ్‌ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 


నేడు (మార్చి 12) జరగాల్సిన టీపీబీవో (టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్) రాత‌ ప‌రీక్ష 15, 16వ తేదీల్లో నిర్వహించాల్సిన వెట‌ర్నరీ అసిస్టెంట్ స‌ర్జన్ రాత‌ ప‌రీక్షను వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు శనివారం (మార్చి 11) రాత్రి కమిషన్‌ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది.  వాయిదా పడ్డ పరీక్షల కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేసింది. హ్యాకింగ్‌పై టీఎస్పీఎస్సీ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తే.. అది ఉద్దేశపూర్వక లీక్ అని తేలింది. గా పేపర్ లీక్ వెనుక టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి హస్తం ఉందని గుర్తించింది.