TS SSC Results 2025 District Wise: హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి రికార్డు స్థాయిలో 98.2 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో 98.7 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. మహబూబాబాద్ జిల్లా మంచి ఫలితాలు సాధించి టాప్‌లో ఉంది. 99.29 ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేసింది. తక్కువ ఉత్తీర్ణత సాధించిన వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 73.97 శాతం విద్యార్థులు మాత్రమే ఈ జిల్లాలో ఉత్తీర్ణత సాధించారు. మిగతా జిల్లాల ఫలితాలను ఈ పట్టికలో చూడొచ్చు.
| జిల్లా పేరు | హాజరైన విద్యార్థులు | ఉత్తీర్ణ సాధించిన విద్యార్థులు | ఉత్తీర్ణతశాతం |
| మహబూబాబాద్ | 8184 | 8126 | 99.29 |
| సంగారెడ్డి | 22374 | 22170 | 99.09 |
| జనగాం | 6234 | 6160 | 98.81 |
| జగిత్యాల | 11849 | 11636 | 98.20 |
| రాజన్న సిరిసిల్ల | 6754 | 6629 | 98.15 |
| కరీంనగర్ | 12508 | 12245 | 97.90 |
| యాదాద్రి భువనగిరి | 8622 | 8432 | 97.80 |
| ములుగు | 3134 | 3060 | 97.64 |
| ఆదిలాబాద్ | 10028 | 9767 | 97.40 |
| పెద్దపల్లి | 7387 | 7157 | 96.89 |
| నల్లగొండ | 18636 | 18054 | 96.88 |
| మెదక్ | 10370 | 10045 | 96.87 |
| నాగర్ కర్నూల్ | 10530 | 10196 | 96.83 |
| సూర్యపేట్ | 11887 | 11508 | 96.81 |
| నిర్మల్ | 9123 | 8822 | 96.70 |
| నిజామాబాద్ | 22694 | 21928 | 96.62 |
| మంచిర్యాల | 9179 | 8861 | 96.54 |
| హన్మకొండ | 12007 | 11542 | 96.13 |
| నారాయణ్‌పేట్ | 7618 | 7251 | 95.18 |
| కామారెడ్డి | 12542 | 11871 | 94.65 |
| ఖమ్మం | 16391 | 15485 | 94.47 |
| జయశంకర్ భూపాల్‌పల్లి | 3443 | 3221 | 93.55 |
| వరంగల్ | 9225 | 8588 | 93.09 |
| మహబూబ్‌నగర్ | 12737 | 11706 | 91.91 |
| సిద్దిపేట్ | 14114 | 12955 | 91.79 |
| జోగులాంబ గద్వాల్ | 7569 | 6944 | 91.74 |
| భద్రాద్రి కొత్తగూడెం | 12250 | 11208 | 91.49 |
| మేడ్చెల్ మల్కాజ్‌గిరి | 47235 | 42870 | 90.76 |
| వనపర్తి | 6842 | 6104 | 89.21 |
| హైదరాబాద్ | 73911 | 65436 | 88.53 |
| రంగారెడ్డి | 51671 | 45386 | 87.84 |
| కొమురం భీమ్ ఆసిఫాబాద్ | 6480 | 5654 | 87.25 |
| వికారాబాద్ | 12846 | 9502 | 73.97 |
ఈసారి ఫలితాల్లో కూడా బాలికలే పై చేయి సాధించారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో వారి ఉత్తీర్ణత శాతమే ఎక్కువగా ఉంది.
| రెగ్యులర్ విద్యార్థులు | మార్చి 2024 | మార్చి 2025 |
| పరీక్షకు హాజరైన వారి సంఖ్య | 494207 | 496374 |
| పాస్ అయిన వారి సంఖ్య | 451272 | 460519 |
| ఉత్తీర్ణత శాతం | 91.31 | 92.78 |
| ప్రైవేటు విద్యార్థులు | మార్చి 2024 | మార్చి 2025 |
| పరీక్షకు హాజరైన వారి సంఖ్య | 11606 | 10733 |
| పాస్ అయిన వారి సంఖ్య | 5772 | 6141 |
| ఉత్తీర్ణత శాతం | 49.73 | 57.22 |
సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణత శాతం గమనిస్తే...
గతేడాది ఫలితాలతో పోలిస్తే ఈసారి ద్వితీయ భాషలో ఎక్కువ మంది ఉత్తీర్ణత సాధించారు. తర్వాత సోషల్ స్టడీస్ ఎక్కువ మంది పాస్ అయ్యారు. పూర్తి వివరాలు ఈ పట్టికలో చూడొచ్చు
| సబ్జెక్ట్ | గతేడాది ఉత్తీర్ణత శాతం (2024) | ఈసారి ఉత్తీర్ణత శాతం(2025) |
| ప్రథమ భాష | 97.12 | 98.62 |
| ద్వితీయ భాష | 99.87 | 99.93 |
| తృతీయ భాష | 98.30 | 99.19 |
| గణితము | 96.46 | 96.18 |
| సామాన్య శాస్త్రం | 96.60 | 96.87 |
| సాంఘీక శాస్త్రం | 99.05 | 99.43 |
మేనేజ్మెంట్ వారీగా ఉత్తీర్ణత శాతం ఇలా
ఈసారి పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పాఠశాల విద్యార్థులు దుమ్మురేపారు. ప్రైవేటు పాఠశాలలతో పోలిస్తే ఉత్తమ ఫలితాలు సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 4,629 పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి. ఇందులో టాప్‌లో ప్రైవేట్ స్కూల్స్ ఉంటే... రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. రెండు ప్రైవేటు పాఠాశాలల్లో ఒక్కరు కూడా పాస్ కాలేదు.
| మేనేజ్‌మెంట్ | పరీక్ష రాసిన విద్యార్థులు | పాస్ అయిన విద్యార్థులు | పాస్ శాతం | వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలు | సున్నా ఫలితాలు సాధించిన పాఠశాలలు |
| రెసిడెన్షియల్ స్కూల్స్ | 2479 | 2449 | 98.79 | 24 | - |
| బీసీ వెల్ఫేర్ స్కూల్స్ | 17431 | 17046 | 97.79 | 143 | - |
| ఎస్‌డబ్ల్యూ ఆర్ | 17440 | 17040 | 97.71 | 108 | - |
| టీడబ్ల్యూఆర్ | 6589 | 6433 | 97.63 | 45 | - |
| మైనార్టీ రెసిడెన్షియల్స్ స్కూల్స్ | 9349 | 9028 | 96.57 | 91 | - |
| మోడల్ స్కూల్స్ | 16455 | 15683 | 95.31 | 79 | - |
| ఆశ్రమ పాఠశాలలు | 8123 | 7717 | 95 | 126 | - |
| కేజీబీవీ | 17818 | 16824 | 94.42 | 230 | - |
| ప్రైవేట్ స్కూల్స్ | 236311 | 222633 | 94.21 | 2007 | 2 |
| ఎయిడెడ్ పాఠశాలలు | 6451 | 5848 | 90.65 | 28 | - |
| జెడ్పీ పాఠశాలలు | 135849 | 121089 | 89.13 | 1675 | - |
| ప్రభుత్వ పాఠశాలలు | 22079 | 18729 | 84.83 | 73 | - |
పదోతరగతి ఫలితాల కోసం ఇక్కడ ఈ లింక్‌లపై క్లిక్ చేయండి
http://results.bse.telangana.gov.in
http://results.bsetelangana.org