Telangana 10th Results Direct Links | హైదరాబాద్: తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన పదవ తరగతి పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. హైదరాబాద్‌లోని రవీంద్ర భారతి వేదికగా సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం రెండు గంటల తరువాత టెన్త్ ఫలితాలు (TG 10th Class Results) విడుదల చేశారు. ఈ ఏడాది టెన్త్ ఫలితాలలో 92.78 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. విద్యార్థులు తమ ఫలితాలను https://telugu.abplive.com/exam-results తో పాటు results.bse.telangana.gov.in , www.results.bsetelangana.org వెబ్‌సైట్లలో విద్యార్థులు రిజల్ట్ చెక్ చేసుకోవచ్చు.

 

రెగ్యులర్ విద్యార్థులు-  పదవ తరగతి రెగ్యులర్ విద్యార్ధుల ఉత్తీర్ణతా శాతము 92.78 %- బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 91.32 %, బాలికల ఉత్తీర్ణతా శాతము 94.26 %- బాలికలు, బాలుర కంటే 2.94% అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

ప్రైవేట్ విద్యార్ధులు:- పదవ తరగతి ప్రైవేటు విద్యార్థుల ఉత్తీర్ణతా శాతము 57.22 %- బాలురు సాధించిన ఉత్తీర్ణతా శాతము 55.14 %, బాలికల ఉత్తీర్ణతా శాతము 61.70 %- బాలికలు, బాలుర కంటే 6.56 % అధికంగా ఉత్తీర్ణత సాధించారు.

రెగ్యులర్ విద్యార్థులుఈ సంవత్సరము 4,629 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాదించినవి. 02 పాఠశాలలు సున్నా శాతము పలితాలు పొందాయి. తెలంగాణ గురుకుల పాఠశాలలు 98.79% తో అత్యధిక ఉత్తీర్ణతా శాతము పొందినాయి.

 గురుకులాల్లో  98 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ఆశ్రమ పాఠశాలల్లో 95 శాతం విద్యార్థులు, అలాగే ప్రైవేట్‌ పాఠశాలల్లో 94.12 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులు అయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈ సారి 1.47 శాతం మంది విద్యార్థులు అధికంగా ఉత్తీర్ణత సాధించారు. 

టెన్త్ ఫలితాలలో ఈసారి కొన్ని మార్పులు చేర్పులు చేపట్టారు. ఏడాది టెన్త్ క్లాస్ ఫలితాలలో జిపిఏ విధానాన్ని తొలగించి, సబ్జెక్టుల వారీగా మార్కుల గ్రేడ్లు ఇవ్వనున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ పరీక్షల విభాగం కన్వీనర్ కృష్ణారావు తెలిపారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు పాస్ అని, కాని విద్యార్థులకు ఫెయిల్ అని టెన్త్ క్లాస్ మార్కులు మేము పై ఇవ్వనున్నారు.

 మొత్తం ఆరు సబ్జెక్టులు కాదా ఒక సబ్జెక్టుకు మొత్తం 100 మార్కులు ఉంటాయి. రాత పరీక్షకు 80 మార్కులు, ఇంటర్నల్ కు 20 మార్కులు చొప్పున కేటాయించారు. హిందీ సబ్జెక్టులో రాత పరీక్షలో 16 కాగా, సబ్జెక్ట్ పాస్ మార్కులు 20.. మిగిలిన ఐదు సబ్జెక్టుల్లో రాత పరీక్షలో 28 మార్కులు, ఓవరాల్‌గా సబ్జెక్టు పాస్ మార్కులు 35 అని తెలిపారు.

Aided, ZP, Government స్కూల్స్ రాష్ట్ర ఉత్తీర్ణత శాతం 92.78% కుంటే తక్కువ ఉత్తీర్ణత సాధించాయి. రాష్ట్ర రెసిడెన్షియల్, బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్, సోషల్ వెల్ఫేర్ రెడిడెన్షియల్, గిరిజన సంక్షేమం, మైనారిటీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్లు, ఆశ్రమ పాఠశాలలు, KGBV, ప్రైవేట్ స్కూళ్లు రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం కంటే ఎక్కువ ఉత్తీర్ణత సాధించాయి. 

ఈ ఏడాది పరీక్షల నుంచే టెన్త్‌లో ఇంటర్నల్స్‌ రద్దు చేయాలని భావించారు. కానీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఆలస్యం కావడంతో ఈ ఏడాది ఇంటర్నల్స్ కొనసాగించారు. వచ్చే ఏడాది నుంచి ఇంటర్నల్స్ ఉండవు. మొత్తం 100 మార్కులు రాత పరీక్షతోనే కేటాయించనున్నారు. తెలంగాణలో పదోతరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 21న ప్రారంభం కాగా, ఏప్రిల్‌ 4 న ముగిశాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు నిర్వహించారు.