2001లో టీఆర్ఎస్ అనే పార్టీ అనౌన్స్ చేసినప్పుడు కేసీఆర్ ముందున్న లక్ష్యం ఒకటే. తెలంగాణను సాధించటం. నీళ్లు, నిధులు, నియామకాల్లో తరతరాలుగా అనుభవిస్తున్న వివక్ష, అణచివేతలను ఎదుర్కోవాలని ఆయన తీసుకున్న నిర్ణయం....తెలంగాణ కలల సాధనకు కారణమైంది. బంగారు తెలంగాణగా మార్చాలనే ఆయన సంకల్పం ఆ పార్టీని అఖండ మెజార్టీతో అధికారంలోకి తీసుకువచ్చింది. తెలంగాణ రాష్ట్ర సమితి అనే ప్రాంతీయ పార్టీ దేశవ్యాప్తంగా రాజకీయాల్లో చాలా సందర్భాల్లో ఓ రోల్ మోడల్ గా నిలిచింది. ఇప్పుడు ఆ పార్టీనే భారత్్ రాష్ట్ర సమితిపేరుతో రాజకీయాల్లో అడుగుపెట్టింది. 


రాజకీయాలు వేరు..నాయకత్వం వేరు. ఓ రాజకీయవేత్త కచ్చితంగా నాయకుడు అనిపించుకోవాల్సిన పనిలేదు. కానీ కేసీఆర్ డిఫరెంట్. ఆయన స్ట్రాటజీస్ డిఫరెంట్. అద్భుతమైన వక్త కావటం ఆయనకు ఓ యాడెడ్ అడ్వాంటేజ్. తెలంగాణ ప్రజల పల్స్ తెలిసన వ్యక్తి ఆయన. ఇప్పుడు భారత రాజకీయాల్లో మార్పు కోసం అడుగుపెట్టారు.


కేసీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టినప్పుడు ఈ బక్క పలుచటి వ్యక్తా తెలంగాణ తెచ్చేది అనేది హేళన చేశారు. కానీ ఆ విమర్శలను సవాల్ గా తీసుకున్నారు. అధికారంలో ఉన్న అప్పటి యూపీఏ దిగివచ్చేలా తెలంగాణ వ్యాప్తంగా సాగిన ఉద్యమం భారత్ చరిత్రలో ఓ మర్చిపోలేని ఘట్టం. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తో మొదలు పెట్టి....సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్ వరకూ తెలంగాణ ప్రజల పోరాటానికి హస్తిన దిగి వచ్చింది. తెలంగాణ కల సాకృతమైంది. ఇప్పుడు అదే వివక్ష, అదే అణచివేత జాతీయ స్థాయిలో ఉందని చెబుతున్న కేసీఆర్...దేశవ్యాప్తంగా రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సర్వశక్తులు ఒడ్డుతానంటున్నారు. ఓ భారతీయుడిగా, ఓ రాజకీయ వేత్తగా ఆయనకు ఆ హక్కు ఉంది. జాతీయ స్థాయిలో పరిణామాలు, అక్కడి ప్రజలు ఆదరించే విధానం ఎలా ఉంటాయనేది ఇప్పటికిప్పుడు ఓ అంచనాకు రాలేం కానీ... ఉద్యమనాయకుడి నుంచి దేశ్ కీ నేతా వరకూ కేసీఆర్ ఎదిగిన తీరు మాత్రం సవాళ్ల మెడలు వంచిందే అని మాత్రం చెప్పగలం.