Hyderabad Traffic Restrictions: నేడు నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు వెల్లడించారు. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో భారత్ - న్యూజిలాండ్ జట్ల మధ్య మొదటి వన్డే క్రికెట్ మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు కొనసాగుతాయని తెలిపారు. సోమాజిగూడ నుంచి రాజీవ్ గాంధీ స్టేడియం వరకు సాగే రహదారిలో ఈ ఆంక్షలు ఉంటాయని వివరించారు. సోమాజిగూడ, గ్రీన్ ల్యాండ్స్, బేగంపేట్, రసూల్‌పురా, సీటీవో, ఎస్‌బీహెచ్‌ జంక్షన్, సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ జంక్షన్, అల్లుగడ్డ బావి, మెట్టుగూడ జంక్షన్, తార్నాక, హబ్సిగూడ, ఎన్జీఆర్‌ఐ, ఉప్పల్ ప్రాంతాల్లో ఉండే వారంతా పైన పేర్కొన్న మార్గంలో ప్రయాణించకుండా ఇతర మార్గాల్లో వెళ్లాలని సూచించారు.






హైదరాబాద్ ఎనిమిదవ నిజాం నవాబ్ మీర్ బర్కత్ అలీఖాన్ వాలాషన్ అలియాస్ ప్రిన్స్ ముకర్రంజా బహదూర్ అంత్యక్రియలు బుధవారం రోజు మక్కా మసీదులో జరగనున్నాయి. కడసారి చూపు కోసం అధిక సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున... మక్రా మసీదు పరిసర ప్రాంతాల్లో ఉదయం 8 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు.