Tenali Double Horse Phir Se Udaan:


హైదరాబాద్: తెనాలి డబల్ హార్స్ గ్రూపు వారు తమ CSR లో భాగంగా " ఫిర్ సే ఉడాన్" కార్యక్రమాన్ని నిర్వహించారు. కుటుంబ అవసరాల దృష్ట్యా మహిళలు తమ కెరీర్ లో కొంతకాలం గ్యాప్ తీసుకుని, తిరిగి తమ నైపుణ్యాలను, అనుభవాలను వృధా చేయకుండా తిరిగి ఉద్యోగం చేయాలని భావించి తెనాలి డబల్ హార్స్ గ్రూపు ఈ కార్యక్రమాన్ని శనివారం T Hub- హైదరాబాద్ లో నిర్వహించారు. 


ఈ కార్యక్రమానికి 300 మందికి పైగా మహిళలు హాజరయ్యారు. అలాగే 30 కంపెనీల నుంచి హెచ్ఆర్ మేనేజర్స్ హాజరై మహిళలకు కెరీర్ గురించి ముఖ్యమైన విషయాలు షేర్ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇంటర్వ్యూలు నిర్వహించి, అందులో సెలెక్ట్ అయిన వారిని 'థింక్ మెయిన్స్' అనే సంస్థ డేటా ఎనాలసిస్ లో ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నారు. ఈ ప్రోగ్రామ్ విజయవంతం అవ్వడానికి ' Mogsmen, DT7 solutions మరియు marketing weapons ' సంస్థలు తమ వంతుగా చేయూత అందించారు.


గృహిణిగా ఉన్నా జీవితంలో ఎన్నో సాధించాలన్న తపనతో మహిళలు పలు రంగాల్లో తమ వంతు కృషి చేస్తున్నారు. గతం గురించి ఆలోచించకుండా ఇకనుంచి స్కిల్స్ నేర్చుకుని ఉద్యోగాలు చేసి కుటుంబానికి తమ వంతు సాయం చేయాలని భావిస్తున్న మహిళలు ఇలాంటి కార్యక్రమాలతో లబ్ది పొందుతారని కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంతో మంది మహిళలు, గృహిణులకు కెరీర్ కు ఓ దారి చూపిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కార్పొరేట్ రంగంలో తిరిగి అవకాశాలు దక్కించుకునేందుకు తెనాలి డబల్ హార్స్ నిర్వహించిన కార్యక్రమానికి మహిళలతో పాటు కొన్ని సంస్థల నుంచి విశేష స్పందన లభించింది.


థింక్‌మేట్స్ ఎడ్యు టెక్ సీఈవో విక్రాంత్ విజయ్ షిటోల్ మాట్లాడుతూ.. మహిళలకు అవకాశాలు కల్పించేందుకు, వారికి కెరీర్ పై అవగాహన పెంచేందుకు పలు రంగాల నుంచి గెస్ట్ లను పిలిచామన్నారు. మా ఆహ్వానాన్ని స్వాగతించి పలు కంపెనీల ప్రతినిధులు, ఔత్సాహిక మహిళలు ఈవెంట్ కు హాజరయ్యారని తెలిపారు. ఆ మహిళలు కార్యక్రమానికి విచ్చేసిన పలు సంస్థల హెచ్ఆర్, ఇతర ప్రతినిధులతో మాట్లాడి పలు విషయాలు తెలుసుకున్నారని చెప్పారు.



ఐటీ, ఐటీఈఎస్, ఆటోమొబైల్, అడ్వర్టైజింగ్, హాస్పిటల్, మీడియా, టూరిజం సహా పలు రంగాలకు చెందిన 250 మందికి పైగా మహిళలు, దాదాపు 50 సంస్థలకు చెందిన హెచ్‌ఆర్ ప్రొఫెషనల్స్/హైరింగ్ మేనేజర్‌లు ఇందులో పాల్గొన్నారు. టీ హబ్ సీఈవో శ్రీనివాస్ రావు మహంకాళి, ఇన్ఫోసిస్ వైస్ ప్రెసిడెంట్ మనీషా సబూ లాంటి ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్ని ప్రసంగించారు. మహిళలకు పెళ్లి తరువాత సైతం కెరీర్ విలువ, ప్రాముఖ్యతను వివరించారు.