TPCC Chief Revanth Reddy About KCR: తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అని, దోచుకున్న సొమ్ముతో ఆయన అక్కడికే పారిపోతారు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ కుర్చీ కదులుతుందనే ఆయన తనయుడు, మంత్రి కేటీఆర్ ఢిల్లీలో గల్లీ గల్లీ ప్రదక్షిణలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. జూబ్లీహిల్స్ లో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ ఢిల్లీ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని.. కేవలం కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల జరుగుతున్నాయని ఢిల్లీలో మకాం వేశారన్నారు. 


ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, కానీ పత్రికల్లో, మీడియాలో రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లొంగిపోయారని వ్యాఖ్యానించారు. ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్ ను ఎవరూ నమ్మరని, 9 ఏళ్లుగా కేసీఆర్ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుందన్నారు. ఇప్పటికే రూ.100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ పై మోదీ విచారణ జరిపిస్తున్నారు. కానీ లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్ ను ఎందుకు విచారణ చేయడం లేదు? అని ప్రశ్నించారు.


ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి వచ్చిన బీజేపీ నాయకులు ఇంకా భ్రమలు పెట్టుకోవద్దు అన్నారు. బీజేపీ, బీఆరెస్ ది మీరు అనుకుంటే తెగిపోయే బంధం కాదని,  ఫెవికాల్ బంధం అన్నారు రేవంత్. మీరు ఎంత కంఠశోష పెట్టుకున్నా మీ మాట ఎవరూ వినరు అని.. తెలంగాణకు పట్టిన చీడ వదలాలంటే ఏకైక ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కాంగ్రెస్ వేదికగానే కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలుగుతుందన్నారు. మీరు ఢిల్లీలో ఎన్ని ప్రదక్షిణలు చేసినా మీకు జవాబు రాదని, తెలంగాణ గల్లీల్లో పర్యటించి కేసీఆర్ పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దామని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 
 Also Read: JP Nadda Telangana Visit: జేపీ నడ్డాకు ఘన స్వాగతం - నోవాటెల్ లో తెలంగాణ బీజేపీ నేతలతో కీలక భేటీ


మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే..!
రాష్ట్ర బీజేపీ నేతల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. మీ ఢిల్లీ బీజేపీ నేతలు, కేసీఆర్ ఒక్కటే అని తెలుసుకోవాలని సూచించారు రేవంత్. తెలంగాణను చివరకు రోడ్లు అమ్ముకునే పరిస్థితికి కేసీఆర్ తీసుకొచ్చారని విమర్శించారు. సీఎం కేసీఆర్ కు ఇష్టమైన ప్రాంతం దుబాయ్ అని, కుటుంబం దోచుకున్న సొమ్ముతో ఆఖరికి అక్కడికే పారిపోతారు అంటూ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీకి వెళ్తున్నారు.
Also Read: Bandla Ganesh: పాదయాత్రలో అడుగులో అడుగేసి మీ గెలుపు కోసం వస్తున్నా అన్నా: బండ్ల గణేష్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial