ప్రభుత్వంపై, ముఖ్యంగా మంత్రి కేటీఆర్‌ లక్ష్యంగా తరచూ విమర్శలు చేసే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి ఆరోపణలు చేశారు. మరో అంశాన్ని ఎంచుకొని అందులోకి మంత్రి కేటీఆర్‌ను సైతం లాగారు. అయితే, ఈసారి రేవంత్ రెడ్డి దృష్టి అక్రమ నిర్మాణాలపై పడింది. తాజాగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్న తీరుకు సంబంధించి ఓ వీడియో ట్వీట్ చేసి ప్రశ్నించారు.. రేవంత్. దానికి మంత్రి కేటీఆర్‌ను, సీఎంను కూడా ట్యాగ్ చేశారు.


హైదరాబాద్‌లోని ఉప్పల్ చౌరస్తాలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయంటూ తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్కాజ్ గిరి ఎంపీ అయిన రేవంత్ రెడ్డి ఉప్పల్ చౌరస్తాలో అక్రమంగా మల్టీ ప్లెక్స్ నిర్మాణాలు చేపడుతున్నారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన మంత్రి అండతో ఉప్పల్ చౌరస్తాలో అనుమతి లేని అక్రమ నిర్మాణం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ట్వీట్‌లో రాశారు. మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా.. లేదా మీరూ భాగస్వాములేనా అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. నిర్మాణాలకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను జోడించి చేస్తూ తెలంగాణ సీఎంవోకు, జీహెచ్ఎంసీ కమిషనర్‌కు రేవంత్ ట్యాగ్ చేశారు. 


Also Read: KCR: కేసీఆర్ మాటలకు అర్థాలే వేరా ? తెలంగాణలో ముందస్తు ఖాయమేనా ?


‘‘హైదరాబాద్ మంత్రి అండ… ఉప్పల్ చౌరస్తాలో… అనుమతి లేని అక్రమ నిర్మాణం… ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోని అధికారులు… కేటీఆర్ గారూ.. మీ శాఖ బాగోతాల మీద చర్యలుంటాయా..? లేదా మీరూ భాగస్వాములేనా…!?’’ అంటూ రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఈ వ్యవహారంలోకి మంత్రి కేటీఆర్‌ను కూడా లాగడం ప్రాధాన్యం సంతరించుకుంది.


Also Read: నా బుల్లెట్టు బండెక్కి వెళ్దాం.. వస్తావా? మంత్రి కేటీఆర్‌కు ఎమ్మెల్యే రాజాసింగ్ సవాల్


కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ వ్యవహారంలో కూడా..
2016లో బయటపడ్డ టాలీవుడ్ డ్రగ్స్ కేసులో పలువురిని కొద్ది రోజుల క్రితం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో రేవంత్ రెడ్డి మంత్రి కేటీఆర్‌కు సవాలు విసిరారు. మనమంతా డ్రగ్స్ టెస్ట్ చేయించుకొని సమాజానికి పారదర్శకంగా ఉండాలని, అందుకే ఉస్మానియాలో డ్రగ్స్ టెస్టుకు తాను కూడా రావాలని చాలెంజ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్ తాను డ్రగ్స్ టెస్ట్ చేయించుకుంటానని, తనతో పాటు రాహుల్ గాంధీ కూడా ఆ పరీక్ష చేయించుకోవాలని సమాధానం ఇచ్చారు. అంతేకాక, తాను డ్రగ్స్ తీసుకోలేదని తేలితే.. తెలంగాణ పీసీసీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం అప్పట్లో కొద్ది రోజులు తీవ్రంగా చర్చనీయాంశం అయింది.


Also Read: Akkiraju Haragopal: అక్కిరాజు హరగోపాల్.. ‘అర్కే’గా ఎలా..? దీని వెనక అసలు కథేంటంటే..






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి