సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే తెలంగాణ మంత్రి కేటీఆర్.. ప్రభుత్వం ఆలోచనలు చెప్పడమే కాదు... ప్రజల సమస్యల పరిష్కారంలో కూడా ముందే ఉంటారు. ఎవరు ఎలాంటి సమస్యలపై ట్వీట్ చేసినా వెంటనే రియాక్ట్ అవుతుంటారు. అలాంటి కేటీఆర్‌కు సోషల్ మీడియాలోనే ఓ ఛాలెంజ్ వచ్చింది. ప్రముఖ మణిపాల్ యూనివర్శిటీ ఛైర్న్‌ ఆ సవాల్ చేశారు. 


మణిపాల్ యూనివర్శిటీ ఛైర్మన్ మోహన్ దాస్ విసిరిన ట్విట్టర్ ఛాలెంజ్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్వీకరించారు. తెలంగాణలో పోషకాహార లోహంపై ఉన్న గణాంకాలను రానున్న 18 నెలల్లో తిరగ ర్సాతమని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. అయితే నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ.. పోషకాహార లోపంపై కేటీఆర్ ట్వీట్ కు స్పందించిన  మోహన్ దాస్ ఈ సవాల్ విసిరారు. 






మీరు నిజంగా సూపర్ స్టార్. మీరు తెలంగాణను చాలా ఎక్కువ కాలం పాలించారు కాబట్టి మీ రాష్ట్రంలో పోషకాహార లోపంపై ప్రోగ్రెస్ డేటాను మాకు చూపించండంటూ మోహన్ దాస్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. దీనికి స్పందించిన మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని రీట్వీట్ చేశారు. నా మాటలు మార్క్ చేసుకోండి. కర్ణాటకలోని 40 శాతం కమిషన్ ప్రభుత్వాన్ని, గుజరాత్ లో రేపిస్ట్ ఉపశమన ప్రభుత్వాలను అధిగమనిస్తానని కేటీఆర్ తెలిపారు. 






బీజేపీపై కేటీఆర్ ట్విట్టర్ వార్..


ఛాన్స్ దొరికితే చాలు కేంద్రం, బీజేపీపై సెటైర్లతో విరుచుకుపడుతున్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్‌కీ బాత్‌లో మాట్లాడుతూ... పౌష్టికాహార లోపంపై మాట్లాడుతూ... భోజనం అనడానికి బదులు భజన అన్నారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ టెలిప్రాంప్టర్‌లో తప్పు ఉందని ఎద్దేవా చేశారు. ఇలాంటి టైంలో పౌష్టికాహారం లోపంపై దృష్టిపెట్టాలని సూచించారు.