Telangana Minister Konda Surekha: తీవ్ర దుమారం రేపిన తన వ్యాఖ్యలను మంత్రి కొండా సురేఖ వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రచారం నడుస్తోంది. కొన్ని మీడియా సంస్థలు ఆమెను ఫోన్ చేసినప్పుడు విచారం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. అయితే అంతకంటే ముందే కొండా సురేఖ పేరుతో ఉన్న ఓ ఎక్స్‌ అకౌంట్ నుంచి తన మాటలు ఉపసంహరించుకుంటున్నట్టు ట్వీట్ ఉంది. అదే నిజమైన అకౌంట్ అనుకొని చాలా మంది రియాక్ట్ అవుతున్నారు. 


కొండా సురేఖ పేరుతో ఫేక్‌ ట్వీట్‌ వైరల్ 


కొండా సురేఖ పేరుతో ఉన్న ఆ ట్వీట్‌లో ఏముంది అంటే... నా వ్యాఖ్యల ఉద్దేశం మహిళల పట్ల ఒక నాయకుడి చిన్నచూపు ధోరణిని ప్రశ్నించడమే కానీ మీ మనోభావాలను దెబ్బతీయడం కాదు అని సమంతను ఉద్దేశించి రాసుకొచ్చారు. స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాదు.. ఆదర్శం కూడా అని వివరించారు. తన వ్యాఖ్యల పట్ల మీరు కానీ, మీ అభిమానులు కానీ మనస్తాపానికి గురైనట్లైతే బేషరతుగా నా వ్యాఖ్యలను పూర్తిగా ఉపసంహరించుకుంటున్నాను.. అన్యద భావించవద్దు. అంటు అందులో రాసుకొచ్చారు.


కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా తీవ్ర దుమారాన్ని రేపాయి. అమె టార్గెట్‌ కేటీఆర్ అయినప్పటికీ ఆ వ్యాఖ్యలు మాత్రం అక్కనేని, సమంతకు టార్గెట్ అయ్యాయి. దీంతో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎక్కువయ్యాయి. 


అక్కినేని ఫ్యామిలీ ఆగ్రహం


ముఖ్యంగా అక్కినేని ఫ్యామిలీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ఇలాంటి వాళ్లను కంట్రోల్ చేయాలని రాహుల్ గాంధీకే ట్యాగ్ చేసిందా ఫ్యామిలీ. మహిళను ఇలా కించపరుస్తారా అంటూ ఇండస్ట్రీలోని చాలా మంది నటులు, ఇతర టెక్నీషియన్స్‌ కూడా విరుచుకు పడ్డారు. బడా హీరోలు కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు 24 గంటల్లో ఉపసంహరించుకోకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ మంత్రి కొండా సురేఖకు లీగల్ నోటీసులు పంపించారు. 




విచారం వ్యక్తం చేస్తున్న కొండా సురేఖ


ఇప్పటికే హైడ్రా, ఆపరేషన్ మూసీ పేరుతో ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు టార్గెట్ చేశాయి. ఇంతలో అనవసరమైన కామెంట్స్‌తో మరో వివాదం ఎందుకనే ధోరణితో ప్రభుత్వం వ్యవహరించినట్టు తెలుస్తోంది. అందుకే తన వ్యాఖ్యలపై విచారం వ్యక్తం చేస్తున్నట్టు తనకు ఫోన్ చేసిన మీడియా ప్రతినిధులతో చెబుతున్నారు. కేటీఆర్‌ వైఖరిపైనే చేసిన కామెంట్సే తప్ప వేర్ వారిని ఉద్దేశించి చేసినవి కావని అంటున్నారామె. మిగతా వాళ్ల పేరు తీసుకురావడంతో మిస్ ఫైర్ అయ్యాయని బాధపడుతున్నారు. వాళ్ల మనోభావాలు , వారి అభిమానుల మనోభావాలు దెబ్బతిని ఉంటే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానంటూ చెబుతున్నారు. 


Also Read: డ్రగ్స్ అలవాటు చేసి హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారు - కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు