Minister Seethakka : పేద ప్రజల భూములను రియల్‌ ఎస్టేట్‌(Real Estate) వ్యాపారం కోసం ప్లాట్లుగా మార్చి అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని మంత్రి సీతక్క ఆరోపించారు.  బుధవారం హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్‌లో ఏర్పాటు చేసిన సరస్ ఫెయిర్‌-2024 బతుకమ్మ వేడుకల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్‌(KTR)..  చాట్ చాట్‌గా కాదు డైరెక్ట్‌గా వచ్చి మాట్లాడు. పండుగపూట కూడా అనవసరంగా మావెంట పడి అనవసరంగా తప్పుడు కూతలు కూస్తు మమ్మల్ని విమర్శిస్తున్నారు. మీ కుటుంబం, మీ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారు. మా బాధ ఆవేదన కేటీఆర్ కుటుంబ సభ్యులకు తప్పకుండా తగులుతుంది. ప్రజల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారాలుగా మార్చి ప్లాట్లుగా అమ్ముకున్న చరిత్ర బీఆర్ఎస్(BRS) పార్టీది. రాహుల్‌ గాంధీ(Rahul Gandhi) కుటుంబం త్యాగం, కష్టం, నిజాయితీ ముందు నువ్వెంట? రాహుల్‌ గాంధీని విమర్శించే స్థాయి కేటీఆర్‌ది కాదు. బీసీ, ఎస్టీ మంత్రులుగా ఆర్థిక నేపథ్యంతో కాకుండా.. స్వతంత్రంగా ఎదిగాం. మేం సమ్మక్క సారలమ్మ, రాణి రుద్రమ ప్రాంతాల నుంచి వచ్చాం. ఎందుకు మా మీద అక్కసు.


వారి చరిత్ర అందరికీ తెలుసు
 వరదల్లో మునిగి ప్రజలు నష్టపోవద్దని ప్రభుత్వం ప్రక్షాళన చేపట్టింది. బీఆర్ఎస్ ప్రజల ఇళ్లను కూలగొట్టి బుల్డోజర్ ప్రభుత్వం నడిపారు. ప్రజలే స్వచ్చందంగా కూల్చుకుంటున్నారు. మూసీ(Moosi) కూల్చివేతల అంశంలో పేదలకు నష్టం రాకుండా ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు. మమ్మల్ని శిఖండి అని ఎలా అంటారు ? అసభ్యకరంగా  మమ్మల్ని ఎలా దూషిస్తారు ?  గత మాజీ మహిళా మంత్రుల చరిత్ర.. ఇప్పటి మహిళా మంత్రుల చరిత్ర ప్రజలకు తెలుసు... మేం నామినేట్ చేస్తే అప్పనంగా వచ్చినోళ్ళం కాదు.. ప్రజలను చేత ఎన్నుకున్న మంత్రులం. వెంటపడి మమ్మల్ని వేధిస్తున్నారు దుర్మార్గులు. పనికట్టుకొని మేం సినిమా(Cinema) వాళ్ళ గురించి మాట్లాడట్లేదు. ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్ళకు ఉంటుంది.. సందర్భాన్ని బట్టి కొంతమంది సినీ ప్రముఖుల పై మాత్రమే మాట్లాడారు. సినిమా యాక్టర్లకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళను ద్వేషించడం లేదు. పండగపూట ప్రజలను ఆడబిడ్డలను ఆనందంగా ఉంచాలి.


బతుకమ్మ శుభాకాంక్షలు
తెలంగాణ మహిళలందరికీ బతుకమ్మ(batukamma) శుభాకాంక్షలు. బతుకమ్మ అంటేనే చెరువులను పూజించే పండుగ పూలను పూజించే పండుగ. ప్రపంచంలోనే పువ్వులను పూజించే అత్యంత గొప్ప పండుగ. ఆడబిడ్డలు తల్లిగారింటికి వచ్చి కష్టాలను పంచు కునే పండుగ బతుకమ్మ పండుగ. కనీసం ఈ తొమ్మిది రోజులైనా ఆడకూతురులను స్వేచ్ఛగా ఆడుకోనివ్వండి. ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వచ్చే విధంగా కుటుంబాలు ప్రోత్సహించాలి అండగా ఉండాలి. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు ఆశీస్సులు ప్రతిన బూనలి’’ అని మంత్రి సీతక్క తెలిపారు. 


ట్రోలింగ్ పాలిటిక్స్
 గత రెండు రోజులుగా రాష్ట్రంలో సోషల్ మీడియా(social media) ట్రోలింగ్ రాజకీయాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య ఈ వార్‌ నడుస్తోంది. సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. మీడియాతో మాట్లాడిన మంత్రి కొండా సురేఖ.. సోషల్ మీడియాలో బీఆర్ఎస్ తనపై అనుచిత పోస్టులు పెట్టారని బీఆర్ఎస్, కేసీఆర్, కేటీఆర్ లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. కేటీఆర్.. మీ ఇంట్లో ఆడవాళ్లు లేరా..? అలా అయితే ఈ పోస్టులు చూపించండి.. ఇక ఎలా రియాక్ట్ అవుతారో చెప్పండి అంటూ మంత్రి కంటతడి పెట్టారు. మంత్రి కొండా సురేఖ మాటలపై ఇటు కేటీఆర్ కూడా స్పందించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ(Konda Surekha) గారివి.. దొంగఏడుపులు.. పెడబొబ్బలన్నారు. గతంలో కూడా తమపై ఆమె ఇష్టానుసారంగా మాట్లాడారన్నారు. తమపై ఆరోపణలు చేసేముందు తాను గతంలో మాట్లాడిన బూతు మాటలను ఒకసారి గుర్తు తెచ్చుకుంటే మంచిదన్నారు. నేడు మంత్రి కొండా సురేఖ పై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క స్పందించారు. 


బతుకమ్మ ఆడిన మంత్రులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్(Hyderabad) లోని నెక్లెస్ రోడ్ లో బతుకమ్మ సంబురాలు నిర్వహించింది. ఈ వేడుకలకు  మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆడబిడ్డలందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మహిళలతో కలిసి మంత్రి సీతక్క పాటలు పాడుతూ బతుకమ్మ ఆడారు. బతుకమ్మ సందర్భంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వరంగల్ లోని తోట మైదానంలో మంత్రి కొండా సురేఖ, కలెక్టర్ సత్యశారద దేవి బతుకమ్మ ఆడారు.


Also Read :  ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్