Hyderabad News | హైదరాబాద్ నగరంలో జనాభా పెరుగుదల, పర్యావరణ పరిరక్షణ దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం 65 వేల కొత్త త్రి వీలర్ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో పెట్రోల్ , డీజిల్ లేని త్రీ వీలర్ ఆటోలు తిరిగేందుకు అనుమతి ఇచ్చింది.

హైదరాబాద్ నగరంలో గత కొంతకాలంగా కొత్త ఆటో రిక్షాలకు పరిమితి ఉంది.  కొత్త ఆటో రిక్షాలు నడిపేందుకు పరిమిట్లు ఇవ్వడానికి లేదు. తాజాగా ఆ పరిమితిని సడలిస్తూ జీహెచ్ఎంసీ (GHMC), ఓఆర్ఆర్ (Hyderabad ORR) లోపల పరిమిత సంఖ్య లో ఎలక్ట్రిక్, సిఎన్జీ, ఎల్పీజీ ఆటో రిక్షాలకు అనుమతి ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో 263 జారీ చేసింది.

కొత్త ఆటో రిక్షా పర్మిట్లకు పెరిగిన డిమాండ్

హైదరాబాద్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. నగరంలో రోజురోజుకు  జనాభా పెరుగుతోంది ఇతర ప్రాంతాల నుంచి వలసలు సైతం పెరుగుతున్నాయి. దాంతో ORR లోపల ఏర్పడిన కొత్త లేఅవుట్ల, అపార్ట్మెంట్లు ఫలితంగా పట్టణీకరణలో  సవాళ్లు తలెత్తాయి. నగరంలో జనాభా పెరుగుదల కారణంగా కొత్త ఆటో రిక్షా పర్మిట్లకు డిమాండ్ పెరిగింది. 

ఈ అంశాలను పరిగణణలోకి తీసుకుని హైదరాబాద్ నగరంలో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించడానికి, అదే సమయంలో ప్రజా రవాణాను మెరుగుపరచడానికి ఎలక్ట్రిక్/ LPG/ CNG ఆటో రిక్షాలను అనుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది..

ఓఆర్ఆర్ లోపల కొత్తగా 20 వేల ఎలక్ట్రిక్ ఆటో రిక్షా లకు  అనుమతి10 వేల కొత్త LPG ఆటో రిక్షాలకు అనుమతి10 వేల కొత్త CNG అటో రిక్షాలకు అనుమతి

డీజిల్ ,పెట్రోల్  వాహనాలకు సంబంధించిన ఆటోలకు రేటిరోఫీట్మెంట్ చేసి వాటి ఇంజన్ ను CNG,LPG, ఎలక్ట్రిక్ లాగా మార్చుకోవడానికి 25 వేల వాహనాలకు అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. ఇప్పటి వరకు ఉన్న డీజిల్ ,పెట్రోల్ ఆటో రిక్షాల ట్రాన్సఫర్ లేదా డీజిల్ పెట్రోల్, కొత్త ఆటో రిక్షాలకు ఓఆర్ఆర్ (Hyderabad ORR) పరిధిలో అనుమతించరు. 

నగరంలో ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు CNG, LPG తీసుకురావడానికి 2 ప్రధాన కారణాలున్నాయి. ఓఆర్ఆర్ లోపల ప్రజా రవాణా మెరుగు పరచడం. ఎలక్ట్రిక్ , LPG, CNG ఆటోలకు అనుమతితో నగరంలో వాయు, శబ్ధ కాలుష్యాన్ని కొంతమేర తగ్గించవచ్చు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో దాదాపు 65 వేల ఆటో రిక్షాలు నడిపే వారి కుటుంబాలకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు.