Telangana Liberation Day | హైదరాబాద్: కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడం, రైతులను రాజులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు. భూమి కోసం, బుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం చాకలి ఐలమ్మ, మల్లు స్వరాజ్యం, ఆరుట్ల కమలాదేవి వంటి వీర వనితలు పోరాటంలో ముందు నడిచారు. దేశంలో తెలంగాణ మహిళలు ఉన్నతంగా నిలిచేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నారాయణపేట జిల్లాలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకులో 6 నెలల్లో రూ.15.50 లక్షల లాభాలు ఆర్జించారు. అవకాశం వస్తే ఏదైనా సాధిస్తామని మహిళలు నిరూపించారు. 

ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే రాసుకున్న పోరాట చరిత్ర తెలంగాణ. నిజాం నియంతృత్వ పాలనపై సామాన్యుడు సాయుధ పోరాటంతో సాధించుకున్న విజయం నేడు మనం అనుభవిస్తోన్న ప్రజాస్వామ్యం అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉద్యమాల చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఘనత తెలంగాణ సాయుధ పోరాటానిదని రేవంత్ రెడ్డి కొనియాడారు.

ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశానికి ఆదర్శం..

ఆహార ధాన్యాల కొరత నుంచి ధాన్యాల సమృద్ధి చేసిన ఘనత కాంగ్రెస్ సొంతం. రుణమాఫీ చేశాం. రైతుల కోసం తెస్తున్న పథకాలు వారిని రాజును చేస్తున్నారు. రాష్ట్రంలో 25.31 లక్షల 20 వేల 600 కోట్ల మేర రుణమాఫీ చేశాం. దేశంలో ఏ రాష్ట్రం చేయని విధంగా రైతులను ఆదుకున్నాం. ఇందిరమ్మ రైతు భరోసా కింద 9 రోజుల్లో 9 వేల కోట్లు జమ చేశాం. లక్షా 4 వేల కోట్లు రైతు ప్రయోజనాల కోసం ఖర్చు చేసిన ఏకైక ప్రభుత్వం మాది. రైతుల నుంచి చివరి గింజ ధాన్యం కొని 48 గంటల్లోనే నగదు జమ చేస్తున్నాం. 24 గంటలు వారికి ఉచిత విద్యుత్ అందిస్తున్నాం. గత ఏడాది 2.90 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తితో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఈ ఏడాది 2.80 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యంతో అగ్రస్థానంలో నిలిచాం. 

నియామకాలలో రికార్డుతక్కువ సమయంలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ద్వారా నిరుద్యోగ యువకులకు అందించాం. మెయిన్స్ కు ఎంపికైన 180 మందికి ఆర్థిక సహాయాన్ని అందించా. తరువాత ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థులకు మరో లక్ష రూపాయలు ఇచ్చాం. ఇప్పటివరకూ 10 మంది అఖిల భారత సర్వీసులకు ఎంపిక కావడం గర్వకారణం. తెలంగాణ యువత ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ లాంటి సర్వీసులకు ఎంపికై రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతున్నారు.

కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదుగత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ధరణి చట్టంతో రెవెన్యూ వ్యవస్థ అస్తవ్యస్తమైపోయింది. మా ప్రభుత్వం వచ్చాక, భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టి సమర్థంగా అమలు చేస్తున్నాం. రాష్ట్రంలో మాత్రమే పేదలకు సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం అమలులో ఉంది. కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాజీ పడేది లేదు.  న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నాం. 904 టీఎంసీల నీటి హక్కులను సాధించేందుకు ట్రైబ్యునల్‌ ఎదుట బలమైన వాదనలు వినిపించి, కృష్ణా నదీ జలాల హక్కుల కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తాము. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ (SLBC) పూర్తిచేసి, ఫ్లోరైడ్‌ సమస్యను పరిష్కరిస్తాం. ఎవరెన్ని అడ్డంకులు కల్పించినా, వెనకడుగు వేయం. ఈ డిసెంబర్ 9 నాటికి అనేక అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు.

 

గేట్‌వే ఆఫ్‌ వరల్డ్‌గా హైదరాబాద్‌నుహైదరాబాద్‌ అంటేనే ఒక బ్రాండ్‌. ఈ నగరాన్ని గేట్‌వే ఆఫ్‌ వరల్డ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది. 2047 నాటికి రాష్ట్రం 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలి. హైదరాబాద్‌కు గోదావరి జలాలు తీసుకురావడంతో పాటు కాలుష్యం లేని నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. మూసీ నదీ పక్కన నివసించే పేదలకు మంచి జీవన ప్రమాణాలు కల్పించి, వారికి ఉపాది అవకాశాలు అందించేందుకు చర్యలు చేపడతాం. అలాగే, పర్యాటకులను ఆకర్షించే విధంగా మూసీ నదిని రూపుదిద్దుతాం అన్నారు.