MLA Raghunandan Rao: ఐపీఎస్ పోస్టింగుల్లో తెలంగాణ అదికారులకు తీవ్ర అన్యాయం జరిగిందని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. కీలక పోస్టుల్లో ఒక్క తెలంగాణ అధికారిని కూడా సర్కారు నియమించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే రఘనందన్ మాట్లాడారు.


ఏపీ కేడర్ కు చెందిన డీజీపీ అంజనీ కుమార్ ను తక్షణమే ఆ రాష్ట్రానికి పంపించాలని మిగతా ఐపీఎస్ లకు న్యాయం చేయాలని రఘనందన్ డిమాండ్ చేశారు. ఇటీవల జరిగిన 93 మంది ఐపీఎస్ ల బదిలీల్లో నాలుగు కీలక పోస్టులను బిహార్ అధికారులు అంజనీ కుమార్, సంజయ్ కుమార్ జైన్, షానవాజ్ ఖాసిం, స్వాతి లక్రాకు కేటాయించారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కు వీళ్లంతా బీ టీం అని రఘునందన్ ఆరోపించారు. తెలంగాణలో ఇటీవల జరిగిన ఐపీఎస్ బదిలీలపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు విమర్శలు చేశారు. బిహార్ కు చెందిన నలుగురికి కీలక పోస్టులు కేటాయించారని ఆరోపించారు.