Kishan Reddy vs Revanth Reddy: బీసీ రిజర్వేషన్ల వ్యవహారం తెలంగాణలో పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ముఖ్యంగా కాంగ్రెస్- బీజేపీ మధ్య సవాల్ప్రతిసవాల్లు సాగుతున్నాయి. ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కాషాయ నేతలు మండిపడుతున్నారు. రాహుల్ ప్రధానమంత్రి కాలేడని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పదవి ఊడటం ఖాయమని అంటున్నారు. క్రమంలోనే కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అమలు విషయంలో రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి సవాల్ చేశారు. ముస్లింలకు ఇచ్చిన పది శాతం రిజర్వేషన్ తీసేసి బిల్లు పంపిస్తే ఆమోదింపజేసేందుకు తాను చొరవ తీసుకుంటానని అన్నారు. పని చేస్తే తానే రాష్ట్రపతి, ప్రధానమంత్రితో సమావేశమై వారిని ఒప్పిస్తానని అన్నారు. అసదుద్దీన్, అజారుద్దీన్, షబ్బీర్ అలీలు బీసీలు ఎలా అవుతారని వాళ్లను బీసీల్లో చేర్చడం ఏంటని ప్రశ్నించారు. విషయంలో రేవంత్ సర్కారు పునరాలోచించాలని సూచించారు.

ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా ఇప్పుడు తప్పును బీజేపీ, కేంద్రంపై నెట్టేందుకు రేవంత్ సర్కారు ప్రయత్నిస్తోందని కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. అధికారంలోకి వచ్చిందేకు అమలు కాలని హామీలు ఇచ్చారని ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని అంటున్నారు. వాటిని సరిగా చేయలేకపోయారని ఇప్పుడు బీసీ రిజర్వేషన్ విషయంలో అదే మోసం కంటిన్యూ చేస్తున్నారని అన్నారు. డిక్లరేషన్ పేరుతో ఊదరగొట్టిన కాంగ్రెస్ ఇప్పుడు వర్గానికి న్యాయం చేయలేదని ఆరోపించారు. చేసిన మోసాలు అన్నింటికీ రాహుల్ గాంధీ, సోనియా గాంధీయే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

బీసీ రిజర్వేషన్పై కాంగ్రెస్కు, రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదని కిషన్ రెడ్డి ఆరోపించారు. ఢిల్లీలో ధర్నా పెట్టి బీసీ రిజర్వేషన్పై మాట్లాడుకుండ గాంధీ కుటుంబం గొప్పలు, ప్రతిపక్షాలు, కేంద్రంపై విమర్శలు చేశారని అన్నారు. ఇలాంటి చిత్తశుద్ధి లేకుండా చేసే డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని అభిప్రాయపడ్డారు.

బీసీ రిజర్వేషన్ అంశంలో కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్పై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. తమ చిత్తశుద్ధిని ప్రజలకు అర్థమైందని అన్నారు. ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేసిన రేవంత్ రెడ్డి తమ కమింట్మెంట్ నిరూపించుకున్నామని తెలిపారు. ఢిల్లీ ధర్నాతో గట్టిగానే వాయిస్ వినిపించామన్నారు. ఇప్పుడు బంతి మోదీ కోర్టులో ఉందని వివరించారు. రాష్ట్రపతికి రాజకీయాలతో సంబంధం లేదని చెప్పిన రేవంత్ రెడ్డి.... రాష్ట్రపతి మోదీ చేతుల్లో ఉన్నారా అని బీజేపీ నేతలు చెప్పానలి సెటైర్లు వేశారు.