Debate on Kaleshwaram Project Report | హైదరాబాద్: తెలంగాణలో ఈరోజు జరగనున్న అసెంబ్లీ సమావేశాాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సహాజంగా ఆదివారం వచ్చిందంటే అందరూ రిాలాక్స్ అవుతారు. వారమంతా కష్టపడి, వీకెండ్ రోజు మాత్రం కాసేపు అలా చిల్ అవుతారు. పార్టీ కార్యాలయాలు, క్యాంప్ ఆఫీసులకు దూరంగా, కుటుంబ సభ్యులతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం గడుపుతారు. వారంలో మాకున్నది ఈ ఓక్కరోజేగా అన్నట్లు కుటుంబానికి నేతలు సమయం కేటాయిస్తుంటారు. కానీ తెలంగాణ రాజకీయాల్లో ఈ ఆదివారం మాత్రం అందుకు పూర్తి విభిన్నం.

Continues below advertisement

అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు

సాధారణంగా ఆదివారం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం అత్యంత అరుదు. అతి ముఖ్యమైన నిర్ణయాలు, అత్యవసర సమస్యలపై చర్చలు చేపట్టాల్సినప్పుడు తప్ప , ఆదివారం అసెంబ్లీ సమావేశాలు జరిగిన సందర్బాలు వేళ్లమీదే లెక్కకట్టవచ్చు. అంతలా అరుదుగా ఆదివారం రోజున అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిన్నటి నుండే ప్రారంభమైయ్యాయి. మొదటి రోజు బిఆర్ ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ మృతి సంతాపతీర్మానం ప్రవేశపెట్టి , సభను ఆదివారం నాటికి వాయిదా వేశారు.

Continues below advertisement

తక్కువ రోజులే సభలో చర్చ

ఈరోజు సభ జరపక తప్పని పరిస్దితి. అందులోనూ ఈ వారంలో గణేష్ నవరాత్రులు , నిమర్జనాలు ఉన్న నేపధ్యంలో ఎక్కువ రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్విహించడం సాధ్యం కాదు. ఎందుకంటే నిమర్జన ఏర్పాట్లు, బందోబస్తు నిర్వహణకు భారీగా పోలీసు సిబ్బంది కావాలి. మొత్తం పోలీసు యంత్రాంగం నిమజ్జన భద్రతపై దృష్టిపెట్టక తప్పని పరిస్దితి. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఇంకా కొనసాగిస్తే , అటు అసెంబ్లీ , ఇటు నిమర్జన భద్రత చూడటం సాధ్యంకాదు. అందుకే మహా అయితే  ఒకటి లేదా రెండు రోజుల్లో అసెంబ్లీ సమావేశాలను ముగించేందుకు అధికార కాంగ్రెస్ సిద్దమైయ్యింది. 

ప్రభుత్వం చేతిలో ఉన్నది అతి తక్కువ సమయం మాత్రమే. అందుకే ఈరోజు ఎంతో కీలకమైనది. కాలేశ్వరం ప్రాజెక్టులో కోట్లాది రూపాయల అవినీతి జరిగింది, నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని బిఆర్ ఎస్ ను విమర్శించి , అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ, కమీషన్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో బహిర్గతం చేయడం ద్వారా కేసీఆర్ ప్రభుత్వంలో జరిగిన కాలేశ్వరం అవినీతి అంటూ ప్రజల ముందుకు తీసుకెళ్లబోతోంది. అందులోనూ ఆదివారం రోజు సెలవు కావడంతో ఎక్కువ మంది టివిలకు అతుక్కుపోతారు, అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారాలు సాధారణ రోజుల కంటే ఇక్కువ మందికి చేరుతాయి. ఇది కూడా కలిసొచ్చే అంశమేనని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇలా టార్గెట్ ఆదివాారంగా రేవంత్ సర్కార్ ఈరోజు అసెంబ్లీలో కాలేశ్వరం కమీషన్ ఇచ్చి భ్రమ్మాస్త్రంతో గత కేసీఆర్ ప్రభుత్వంపై విరుచుకపడబోతోంది.

కాళేశ్వరంపై నిజాలు మాట్లాడేది ఎవరో..

ఆదివారం బీఆర్ ఎస్ కూడా తగ్గేదేలే అంటోంది. చట్టబద్దత లేని కాళేశ్వరం కమిషన్ చెప్పేది మేము నమ్మం, అవన్నీ అవాస్తవాలంటున్నారు బీఆర్ ఎస్ నేతలు. అసెంబ్లీలో అధికార పార్టీ ఆరోపణలను తిప్పికొట్టడంతోపాటు,  ముందస్తు వ్యూహంగా యూరియా  కొరతపై చర్చకు డిమాండ్ చేసేందుకు సిద్దమైయ్యారు. వరద నష్టాలు, బాధితులకు పరిహారం, రైతులను ఆదుకునేందుకు అవసమైన చర్యలు ఇలా వీటిపైన చర్చ పెట్టండి అంటూ అధికార పార్టీ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు బీఆర్ ఎస్ నేతలు సిద్దమైయ్యారు.

కమిషన్ రిపోర్టుపై చర్చ పెట్టాలంటే 15రోజులు అసెంబ్లీ నిర్వహించండి అన్ని సమస్యలు మాట్లాడదాం , మేం సిద్దమంటున్నారు. అలా కాకుండా ఒకటి రెండు రోజుల్లో కాలేశ్వరం అవినీతి బురద మాపై చల్లి సభ ముగిస్తామంటే చూస్తూ ఊరుకోమంటున్నారు. ఇలా అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ ఎస్ మధ్య ఈ రోజు ఆదివారం అసెంబ్లీ గతంలో ఎన్నడూ లేనంత ఉత్కంఠ రేపుతోంది.