South Central Railway: దక్షిణ మధ్య రైల్వేశాఖ మరోసారి పెద్ద సంఖ్యలో రైళ్లను రద్దు చేసింది. తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. భువనేశ్వర్‌, మంచేశ్వర్‌, హరిదాస్‌పుర్‌-ధన్‌మండల్‌ సెక్షన్‌లో ఇంటర్‌ లాకింగ్‌ పనుల కారణంగా పలు రైళ్లను రద్దు చేసింది. మరికొన్నింటిని పాక్షింగా రద్దు చేసింది. ఈ మేరకు రద్దయిన రైళ్ల వివరాలను దక్షిణ మధ్య రైల్లే శాఖ ప్రకటించింది. 






ఈ నెల 21 నుంచి 29 వరకు 75 రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. మరో వైపు భువనేశ్వర్‌ – ముంబయి, హౌరా – సికింద్రాబాద్‌, భువనేశ్వర్‌ – సికింద్రాబాద్‌ మధ్య రాకపోకలు సాగించే ఆరు సర్వీసులను ఈ నెల 24 నుంచి 30 వరకు పలు తేదీల్లో భువనేశ్వర్‌కు బదులుగా ఖుర్దా రోడ్‌ నుంచి అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వేశాఖ వివరించింది. అలాగే విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసినట్లు పేర్కొంది. 


గత వారం సికింద్రాబాద్‌, హైదరాబాద్‌ డివిజన్ల పరిధిలో పలు రైల్లు రద్దయ్యాయి. నిర్వహణ పనుల కారణంగా రెండు డివిజన్లలో  పలు ప్యాసింజర్, ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేసింది. మరికొన్ని రైళ్ల రాకపోకలను పాక్షికంగా నిలిపివేసింది. రైల్వే ట్రాక్ మెయింటెనెన్స్ పనుల కారణంగా.. మొత్తం 20 ప్యాసింజర్ రైళ్లతో పాటు, 22 ఎంఎంటీఎస్ రైళ్లను వారం రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లుగా తెలిపింది. తాజాగా తూర్పుకోస్తా రైల్వే పరిధిలోని ఖుర్దా రోడ్‌లో మూడోలైన్‌కు నాన్‌ ఇంటర్‌లాకింగ్‌ పనుల నేపథ్యంలో 75 రైళ్లు, విజయవాడ సెక్షన్‌లో గుండాల వద్ద ఇంటర్‌లాకింగ్‌ పనుల కారణంగా 18 రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. ప్రయాణికులు రైళ్ల రద్దు విషయాన్ని గుర్తించాలని, తదనుగుణంగా ప్రయాణాలను మార్చుకోవాలని కోరింది.