Secunderabad Sirpur Kagaznagar Train News: సికింద్రాబాద్ – సిర్పూర్ కాగజ్‌నగర్ రైలుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. ఆ రైలు కోచ్ నుంచి పొగలు వ్యాపించాయి. దీంతో ప్రయాణికులు బెంబేలెత్తిపోయారు. వెంటనే ప్రయాణికులు రైల్వే సిబ్బందికి విషయం చెప్పడంతో రైలును బీబీనగర్ సమీపంలో నిలిపివేశారు. రైలులో నుంచి పొగలు వచ్చిన వెంటనే తాము గమనించి.. చైన్ లాగి రైలును నిలిపివేశామని ప్రయాణికులు చెప్పారు. అనంతరం రైల్వే సిబ్బందికి సమాచారం అందించారు. రైలు ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే దానికి మరమ్మతులు చేశారు. దాదాపు 20 నిమిషాల తర్వాత రైలు మామూలుగా బయలుదేరింది. కాగా, ప్రమాదం తప్పడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
Sirpur Kagaznagar Train: సిర్పూర్ కాగజ్‌నగర్ ట్రైన్‌కు త్రుటిలో తప్పిన ప్రమాదం - కోచ్ నుంచి పొగలు
ABP Desam | 10 Dec 2023 11:55 AM (IST)
Kagaznagar Train News: రైలు ఇంజిన్ బ్రేక్ లైనర్లు బలంగా పట్టేయడంతోనే పొగలు వ్యాపించినట్లు రైల్వే సిబ్బంది గుర్తించారు. వెంటనే దానికి మరమ్మతులు చేశారు.
ప్రతీకాత్మక చిత్రం