Sangareddy Crime News: సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. టెట్ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ గర్భిణీ.. పరీక్ష రాస్తూనే ప్రాణాలు కోల్పోయింది. సమయానికి చేరుకోవాలనే ఆత్రం, ఆలస్యం అవుతుందేమోనన్న భయంతో రాధిక అనే గర్భిణీ తీవ్ర ఒత్తిడికి గురైంది. కారణంగా బీపీ ఎక్కువై ఒక్కసారిగా పడిపోయింది. పరీక్ష రాస్తున్న చోటే కుప్పకూలిపోయింది. అయితే బయటే భార్య కోసం వేచి చూస్తున్న ఆమె భర్త అరుణ్... భార్య పడిపోయిందని తెలుసుకుని లోపలికి వెళ్లాడు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించాడు. కానీ రాధిక అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. భార్య మరణ వార్త విన్న భర్త కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు. ఒకేసారి కడుపులో ఉన్న బిడ్డతో సహా భార్య చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Read Also: Hyderabad Crime News: నీలోఫర్ ఆసుపత్రిలో చిన్నారి అదృశ్యం, ఆరునెలల పాపను అపహరించిన దుండగులు